పవన్ కళ్యాణ్ ని వెనక్కి నెట్టిన షర్మిల...!?
అయితే ఇటీవల నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి మరీ జనసేనాని ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రిలీజ్ చేశారు.
ఏపీలో ఎన్నికల వేడి జోరందుకున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పెద్దగా జనంలోకి రావడం లేదు. గట్టిగా చెప్పాలీ అంటే ఆయన వారాహి వాహనం కూడా చాలా కాలంగా రెస్ట్ తీసుకుంటోంది. నాలుగు నెలల నుంచి వారాహి యాత్రలు అయితే ఏపీలో జరగడంలేదు.
అయితే ఇటీవల నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి మరీ జనసేనాని ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. పవన్ రోజుకు మూడు సభలలతో మొత్తం 175 నియోజకవర్గాలలో తిరుగుతారు అని ఆయన చెప్పారు. దాని కంటే ముందు అభ్యర్ధుల లిస్ట్ ఖరారు కావాల్సి ఉంది. అది ఈ నెలాఖరులో ఉంటుందని అంటున్నారు.
అలా జనసేనాని జనంలోకి రాకుండా ఉంటే కాంగ్రెస్ లో చేరి సడెన్ గా ఏపీ తెర మీద పీసీసీ చీఫ్ హోదాలో ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల వరసగా మీటింగులతో పాటు మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ హైలెట్ అవుతున్నారు. సాధారణంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా టీడీపీకి దానికి మిత్రపక్షంగా ఉన్న పవన్ కి న్యూస్ విషయంలో హైలెట్ చేస్తూ ఉంటుంది.
అంతే కాదు వైసీపీని కానీ జగన్ని కానీ ఏ విధంగా విమర్శించినా భారీ హెడ్డింగులు పెట్టి ఫోకస్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇపుడు జనంలోకి రాకపోవడంతో షర్మిల ఆ లోటు తీరుస్తున్నారు అని అంటున్నారు. పీసీసీ చీఫ్ అవుతూనే జగన్ మీద ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వం బీజేపీతో కలసి రాజీపడిపోయిందని ఏపీ ప్రయోజనాలను కాలదన్నుతోందని షర్మిల ఘాటు కామెంట్స్ చేస్తూ వచ్చారు
దాంతో వైసీపీ యాంటీ స్టాండ్ తీసుకున్న మీడియాలో షర్మిల హైలెట్ అవుతున్నారు. ఆమె ఏమి మాట్లాడినా అది బిగ్ సౌండ్ చేస్తోంది. ఆమె జగన్ మీద చేసిన విమర్శలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అలా కొత్త బాధ్యతలు తీసుకున్న షర్మిల కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మీడియాలో నానుతున్నారు. ఆమె ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా చర్చకు దారి తీస్తున్నాయి.
దాని మీద వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్లు కూడా రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఒక విధంగా పవన్ విషయంలో అలా జరిగేది అప్పట్లో వారాహి యాత్రలో పవన్ జనంలోకి వస్తే పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీ పాలిటిక్స్ నడిచేది. ఇపుడు వైఎస్ షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది.
దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా వెనక్కి నెట్టి షర్మిల ముందుకు వచ్చారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే రేపటి రోజున పవన్ వారాహి రధమెక్కి జనంలోకి వస్తే అపుడు కధే వేరుగా ఉంటుందని అంటున్నారు. అలాగే టీడీపీ ప్రచారం కూడా చంద్రబాబు హోరెత్తిస్తే కూడా అపుడు మరోలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మాత్రం ఇపుడు మీడియాలో హైలెట్ ఎవరు అంటే వైఎస్ షర్మిల అనే అంటున్నారు.