ఇంట్రస్టింగ్... ఇవాళ పగలు 8, రాత్రి 16 గంటలు ఉంటుందా?

సుమారు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉండాల్సి రోజులో 8 గంటలు మాత్రమే పగలు, 16 గంటలు రాత్రి సమయం ఉండే అవకాశం ఈ రోజు ఉందనే ప్రచారం జరుగుతుంది.

Update: 2024-12-21 06:13 GMT

ఒక రోజు అంటే సుమారుగా సగం పగలు, సగం రాత్రి ఉంటుంది! అంటే... 24 గంటల్లోనూ 12 గంటలు పగలు, మిగిలిన 12 గంటలు రాత్రి ఉంటుంది సుమారుగా! అయితే.. ఇవాళ (డిసెంబర్ 21) మాత్రం లెక్క మారుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు పగలు కేవలం 8 గంటలే ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

అవును... సుమారు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉండాల్సి రోజులో 8 గంటలు మాత్రమే పగలు, 16 గంటలు రాత్రి సమయం ఉండే అవకాశం ఈ రోజు ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నయి. ఇదే సమయంలో "లాంగెస్ట్ నైట్" అంటూ సోషల్ మీడియాలోనూ పోస్టులు సందడి చేస్తున్నాయి.

సాధారణంగా ప్రతీ ఏటా డిసెంబర్ 19 నుంచి 23 మధ్య ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని.. ఈ రోజు సూర్యుని నుంచి భూమికి దురం ఎక్కువగా ఉంటుందని.. దీన్ని వింటర్ సోల్ స్టీస్ అంటారని చెబుతున్నారు. ఇదే సమయంలో.. భూమిపై చంద్రకాంతి ఎక్కువ సమయం ఉంటుందని.. అందుకే పగలు, రాత్రి గంటల్లో వ్యత్యాసం అని చెబుతున్నారు!

అదేవిధంగా... ఈ రోజు భూమి దాని ధృవం వద్ద 23.5 డిగ్రీల వంపులో ఉంటుందని.. ఫలితంగా ఉషోగ్రతల్లో మార్పులు సంభవిస్తాయని.. దీంతో దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని.. ఈ సహజ మారే సుదీర్ఘమైన రాత్రి, తక్కువ పగలుకు కారణం అని చెబుతున్నారని అంటున్నారు.

మరి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ నేడు (డిసెంబర్ 21 - శనివారం) మధ్యాహ్నం 2 గంటలకే సూర్యాస్తమయం అవుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి. కాగా... ఈ రోజు ఉదయం కాస్త అటు ఇటుగా ఉదయం 6:41 గంటలకు సూర్యోదయం అయ్యింది!

ఈ వింటర్ ‘స్టోల్ స్టీస్’ అనేది లాటి పదం ‘సోల్ స్టిటియం’ నుంచి వచ్చింది! ఇందులో 'సోల్' అంటే సూర్యుడు, 'స్టిటియం' అంటే ఆగిపోవడం.

ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు!:

వాస్తవానికి ఈ శీతాకాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ అనేది అత్యంత పెద్ద పండుగగా జరుపుకుంటారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో... ఈ స్టోల్ స్టీస్ సమయంలో పలు దేశాల్లో పండుగను జరుపుకుంటారు! ఇందులో భాగంగా.. డోంగ్జీ అనే పండుగను చైనీయులు ఈ సమయంలో జరుపుకుంటారు. వింటర్ స్టోల్ స్టీస్ ని వెలుగు, చీకటి మధ్య సమతుల్యంగా జరుపుకుంటారు.

ఇదే సమయంలో... కొన్ని అమెరికన్ తెగ మధ్య ఈ వింటర్ స్టోల్ స్టీస్ ను సూర్యుడిని తిరిగి తీసుకురావడం అనే ఆచారంగా జరుపుకుంటారని అంటున్నారు. బోయిన్ వ్యాలీలోని న్యూగ్రాంజ్ వద్ద "బోయ్న్ వ్యాలీ గాదరింగ్" అనే వేడుకను ఈ వింటర్ స్టోల్ స్టీస్ సమయంలో చేసుకుంటారు.

Tags:    

Similar News