ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ యాక్షన్ స్టార్ట్!
ఈ క్రమంలో ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారని.. అతని పాస్ పోర్ట్ క్యాన్సిల్ చేయించాలని గతకొన్ని రోజులుగా డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ పాస్ పోర్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు!
ఇదే సమయంలో పాస్ పొర్ట్ రద్దుతో పాటు.. ప్రజ్వల్ ను తిరిగి భారతదేశానికి తీసుకురడానికి తక్షణమే నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని అభ్యర్థన చేశారు! ఈ సమయంలో ఇప్పటికే ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిన నేపథ్యంలో.. విదేశాంగ మంత్రిత్వ శాఖ యాక్షన్ మొదలుపెట్టినలు కనిపిస్తుంది. ఈ మేరకు ప్రజ్వల్ పాస్ పోర్ట్ విషయంలో తగు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.
అవును... అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రజ్వల్ రేవణ్ణ ఎదుర్కొంటున్నట్లు కథనాలొస్తోన్న వేళ.. అతను దేశం విడిచి పారిపోయాడు! తన దౌత్యపరమైన పాస్ పోర్ట్ ను ఉపయోగించి ఏప్రిల్ 27, 2024న దేశం విడిచి జర్మనీకి పారిపోయాడని అంటున్నారు. అయితే అతనివని చెబుతున్న పలు విషయాలు వెలుగులోకి వచ్చిన వెంటనే.. అతనిపై మొదటి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడానికి కొన్ని గంటల ముందు దేశం విడిచి వెళ్లిపోయినట్లు సీఎం సిద్ధరామయ్య తన లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో... మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేతపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్ పోర్టును రద్దు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్రం స్పందించలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణలో ఎలాంటి అలసత్వం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లోపం లేదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఈ కేసును సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు. మరోవైపు జేడీఎస్ నాయకుడు హెచ్.డి కుమారస్వామి కూడా ప్రజల్వ్ రేవణ్ణ కర్ణాటకకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో... కర్ణాటక ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ప్రజల్వ్ పాస్ట్ పోర్ట్ రద్దయితే రెడ్ కార్నర్ నోటీసు జారీచేసి ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.