లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్... ఏమి చెప్పాలనుకుంటున్నారు?

ఇదే సమయంలో ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు చంద్రబాబు లాయర్లు

Update: 2023-10-02 04:31 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదించడానికి, రిమాండ్ లేకుండా చూడటానికి అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రాను హుటాహుటిన ఢిల్లీ నుంచి రప్పించారనేది తెలిసిన విషయమే. అయితే సుమారు 10 గంటల వాదనల అనంతరం ఏపీ సీఐడీ తరుపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది. బాబుకు 14రోజుల కస్టడీ విధించింది.

ఇదే సమయంలో ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు చంద్రబాబు లాయర్లు. అయితే అది కూడా కొట్టివేయబడింది. ఇదే సమయంలో ఏపీ సీఐడీ కస్టడీ కోరుతూ మరో పిటిషన్ వాదనలు వచ్చింది. ఆ విషయంలోనూ ఏపీ సీఇడీ చంద్రబాబును కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో పలుమార్లు ట్విట్టర్ లో విభిన్నంగా స్పందించారు లాయర్ లూథ్రా.

కత్తి తీసి పోరాడాలని, చీకటి తర్వాత వెలుగని.. రకరకాల ట్వీట్లు చేసేవారు. దీంతో నెటిజన్లు సెటైర్లు కూడా వేసేవారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు లూథ్రా. ఇందులో భాగంగా... "గతంలో ఓ కేసు ప్రాథమిక విచారణ తర్వాత హైకోర్టు జడ్జి.. తీర్పును 14 నెలల తర్వాత వెలువరించారని, తీర్పు బాగా ఆలస్యమైనందుకు ఆయనే క్షమాపణ చెప్పారని" తన ట్వీట్ లో ప్రస్తావించారు లూథ్రా!

దీంతో... ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వరుసగా వాయిదాలు పడుతున్నాయనే బాధను లూథ్రా అలా వ్యక్తీకరించారా.. లేక, రేపు సుప్రీంలో జరగబోయే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వీలైనంత తొందరగా ఇవ్వాలని పరోక్షంగా చూసించారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది.

కాగా... చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో... గురుగోవింద్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ... "అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది" అని అర్థం వచ్చేలా ఉన్న ఒక కొటేషన్ ను ట్యాగ్ చేశారు! దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వగా... అధికారపార్టీ నుంచి మాత్రం అవహేళలను ఎక్కువగా వచ్చాయని అన్నారు!

అనంతరం "ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలు, అపహాస్యాన్ని పట్టించుకోకుండా ఒక మనిషి తన విధులను తాను నిర్వర్తించాలి" అంటూ స్వామి వివేకానంద కొటేషన్స్ ను ట్వీట్ చేశారు లూథ్రా. ఇదే సమయంలో "ప్రతీ రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఉదయం వెలుగుని తెస్తుంది" అని మరో కొటేషన్ ట్వీట్ చేశారు. దీంతో... చంద్రబాబుకు మనో ధైర్యం తెచ్చే ప్రయత్నంలో భాగమే ఈ ట్వీట్ అంటూ కామెంట్లు వినిపించాయి.

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కేసుని లాయర్ లూథ్రా & టీం వాదిస్తున్నారు. ఈ క్రమ్మలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ రేపు (అక్టోబరు - 3) న జరగనుంది.

ఇలా ఏ కోర్టులోనూ చంద్రబాబుకి రిలీఫ్ లభించడం లేదనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో మొదలైందని చెబుతున్నారు. ఈ నేపథ్యం లో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Tags:    

Similar News