'భర్త పేరుపై క్లారిటీ ఇవ్వండి'... శాంతిపై మరో 6 అభియోగాలు!

అవును... దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై తాజాగా ఆరు అభియోగాలు నమోదయ్యాయి.

Update: 2024-07-22 10:08 GMT

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆమె భర్తగా రికార్డులో ఉన్న మదన్ మోహన్ మైకుల ముందుకు రావడంతో ఈ వ్యవహారంపై వార్తలు రాయడం, ఛానల్స్ లో చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఆ సంగతి అలా ఉంటే తాజాగా ఆమెపై మరో ఆరు అభియోగాలు నమోదయ్యాయి!

అవును... దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై తాజాగా ఆరు అభియోగాలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా... దేవాదాయశాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ గా చెప్పి, సర్వీస్ రిజిస్టర్ లో అదే నమోదు చేయించారని.. గత ఏడాది జనవరి 25న ప్రస్తూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అనే పేర్కొన్నారని తెలిపారు.

అయితే... ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారని.. విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియామావళికి విరుద్ధమని అన్నారు. అందువల్ల ఈ వ్యవహారంపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆమెకు నోటీసు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేసినట్లు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా... విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేసుక్కునట్లు ప్రకటించి దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారని ఒక అభియోగం మోపగా... కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై మరో అభియోగం నమోదు చేశారు.

ఇదే సమయంలో... గత ఏడాది మే 28న విజయసాయిరెడ్డిని అభినందిస్తున్నట్లుగా ట్వీట్ చేశారని.. ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని.. ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్దమని మరో అభియోగం నమోదు అయ్యింది. ఇదే సమయంలో కొన్ని దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్లో దుకాణాల లీజులు మూడేళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేయడంపైనా వివరణ ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News