'సోషల్ మీడియా' అరెస్టులు..మండలిలో వైసీపీ రచ్చ

ఈ క్రమంలోనే బొత్స సత్యన్నారాయణతోపాటు తోట త్రిమూర్తులు స్పీకర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-11-14 09:27 GMT

శాసన సభలో సంఖ్యాబలం లేకపోవడంతో సభకు డుమ్మా కొట్టిన వైసీపీ శాసన మండలి సమావేశాలకు మాత్రం హాజరవుతోంది. అయితే, సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వకుండా రోజుకో రచ్చతో మండలిలో రసాభాస చేస్తున్నారు వైసీపీ సభ్యులు. నిన్న మండలిలో డయేరియా మరణాలపై రచ్చ చేసి సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు...తాజాగా ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చ రచ్చ చేశారు.

ఆ వ్యవహారంపై చర్చించాలని శాసన మండలి ఛైర్మన్ కు వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు, డీఎస్సీపై పీడీఎఫ్ మరో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే, ఆ రెండు వాయిదా తీర్మానాలకు స్పీకర్ తిరస్కరించారు. బడ్జెట్ పై చర్చ జరుగుతోందని చెప్పారు.

ఈ క్రమంలోనే బొత్స సత్యన్నారాయణతోపాటు తోట త్రిమూర్తులు స్పీకర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్పీకర్ తీరుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు.

అంతేకాకుండా, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి లోకేష్, యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు సజావుగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నా సరే సభలో వారు రచ్చ చేస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News