కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. జగన్ మాటకు ‘సోషల్’ రియాక్షన్ ఇలా

గెలుపు మనకున్న బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఓటమి మనకున్న ఒరిజినల్ బలాన్ని సైతం సగానికి తగ్గిస్తుంది.

Update: 2024-06-14 04:21 GMT

గెలుపు మనకున్న బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఓటమి మనకున్న ఒరిజినల్ బలాన్ని సైతం సగానికి తగ్గిస్తుంది. అందుకే.. ఓటమి వేళ ఉన్న బలాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. గెలుపు వేళ ఉండే అడ్వాంటేజ్ .. ఓటమి వేళ ఉండదన్నది మర్చిపోకూడదు. ఓటమి వేళ టైం సైతం మనకు అనుకూలంగా ఉండదు. అందుకే.. ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావాల్సి ఉంటుంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ అయిన సందర్భంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారటమే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి.

కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. అన్న మాటలకు సోషల్ మీడియాలో పంచ్ లు పెద్ద ఎత్తున పడుతున్నాయి. జగన్ మాటలకు పలువురు స్పందిస్తున్నారు. తమ రియాక్షన్ ను పోస్టుల రూపంలో పెట్టేస్తున్నారు. అలా కళ్లుమూసుకుని ఐదేళ్లు గడపబట్టే.. పాలన లేక ఆంధ్రప్రదేశ్ మటాష్ అయిపోయింది అని ఒకరంటే..‘‘కళ్లు మూసుకుంటేనే మీకు 11 సీట్లు వచ్చాయి’’ అని మరొకరు రియాక్టు అయ్యారు.

ఐప్యాక్ స్క్రిప్టు లేకపోతే మాటలు ఇలాగే ఉంటాయని ఒకరంటే.. 2049 వరకు కళ్లు మూసుకొని ఉండాలని మరొకరు కామెంట్ చేశారు. ‘అన్నా నువ్వు నిజంగానే సీఎంగా చేశావా?’ అంటూ ఇంకొకరు తమకున్న సందేహాన్ని వ్యక్తం చేశారు. 2060 వరకూ కళ్లు తెరవద్దు అన్నా.. మేమూ అదే చెప్పాం సర్.. మీరు ఇక కళ్లు మూసుకొని ప్రశాంతంగా పడుకోండి’ అంటూ సటైర్ సంధించారు.

‘పవర్.. పవర్.. పవర్.. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావా జగనన్నా.. అవి వచ్చే లోపు ప్రజలకు ఏం చేయాలో దాని గురించి ఆలోచించవచ్చు కదా’ అంటూ కీలక సూచన చేశారో నెటిజన్ ఇలా ఎవరికి వారు జగన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ స్పందనల్ని జాగ్రత్తగా చదవటం ద్వారా ఏం మాట్లాడొచ్చు? ఎలా మాట్లాడాలన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News