డబుల్ రాబడి పేరుతో వల విసిరి అడ్డంగా బుక్ చేస్తారు.. బీకేర్ ఫుల్
పెట్టుబడులు పెట్టినంతనే ఇట్టే డబుల్ రాబడి వచ్చేస్తుందన్న పేరాశకు పోయినోళ్లంతా అడ్డంగా బుక్ కావటం తెలిసిందే.
ఆశకు అంతే ఉండదు. ఎంత సంపద ఉన్నా.. ఇలా చేస్తే బోలెడంత డబ్బు వచ్చేస్తుందన్న మాట ఎవరి నోటి నుంచైనా విన్నంతనే వారి వైపు ఆసక్తిగా చూడటం.. అదెలానో తెలుసుకుందామన్న కుతూహలం కలుగుతుంది. ఇదే.. అడ్డంగా మోసపోయేందుకు విసిరే అద్భుతమైన ట్రాప్. ఇలాంటి వాటిల్లో చిక్కుకుంటే అడ్డంగా బుక్ కావటమే కాదు.. కుటుంబాలకు కుటుంబాలు తీవ్రంగా ప్రభావితం కావటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. తాజాగా అలాంటి మోసమే మరొకటి తెర మీదకు వచ్చింది. పెట్టుబడులు పెట్టినంతనే ఇట్టే డబుల్ రాబడి వచ్చేస్తుందన్న పేరాశకు పోయినోళ్లంతా అడ్డంగా బుక్ కావటం తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.
కరోనా తర్వాత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావటం తెలిసిందే. దీంతో.. ఈ కారణాన్ని తమ మోసానికి ముడిసరకుగా వాడేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ఇటీవల కాలంలో పెట్టుబడులు పెట్టే వారు.. తాము భారీ లాభాన్ని పొందుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ బుక్ చేస్తున్నారు. తాజాగా మాయ మాటలు చెప్పి స్టాక్ మార్కెట్ లో తమకు వచ్చిన భారీ లాభాల్ని సాధించినట్లుగా చెప్పుకుంటున్నారు.
వారి మాటల ట్రాప్ లో పడిన కొందరు భారీగా నష్టపోతున్నారు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ వర్సిటీలో అసోసియేట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు 42 ఏళ్ల అమిత్ కిశోర్. ఇతగాడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ ప్రచారం చేస్తారు. మాయమాటలు చెప్పి తొమ్మిది మందితో ఉన్న ఒక వాట్సాప్ గ్రూపులో అతడిని అయాడ్ చేవారు.తాము సలహాలు ఇస్తున్నట్లుగా డబ్బులు పెట్టించారు. ఎలాంటి లాభాలు సంపాదించకున్నా.. ఆటలో గెలిచిన సొమ్మును విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా వారి మోసం యాంగిల్ బయటకు వచ్చింది.
దీంతో అతను పెట్టుబడులు పెట్టకుండా దూరంగా ఉన్నారు. దీంతో తమ రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు.. పెట్టుబడులు పెట్టకుంటే భారీగా ఫైన్లు చెల్లించాల్సి వస్తోందని.. అలా చేయకుంటే అతడిపై ఫైన్లు విధిస్తారని హెచ్చరించారు. దీంతో బెదిరిపోయిన అతను మరింత బెదిరించేందుకు వీలుగా ఫేక్ లీగల్ నోటీసులు పంపారు.
మొత్తంగా అతడి చేత రూ.1.14 కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించారు. ఎలాంటి లాభాలు రాకపోవటంతో తాను అడ్డంగా మోసపోయిన విషయాన్ని గుర్తించి లుథియానా పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ఢిల్లీ.. పశ్చిమ బెంగాల్.. మహారాష్ట్రకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. మొత్తంగా చెప్పేదేమంటే.. డబ్బులు పెట్టుబడిగా పెట్టండి.. బోలెడంత లాభాలు వస్తాయంటే అస్సలు నమ్మకూడదు. వారేమైనా వార్నింగ్ బాటలోకి వెళితే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలే కానీ అస్సలు ఆందోళన పడకూడదన్నది మర్చిపోకూడదు.