బిడ్డను కనండి - లక్షలు పట్టండి... మంత్రిత్వ శాఖ ప్రకటన!

ఇంకొంతమంది అన్నీ బాగున్నా.. పిల్లలు కనడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అంటుంటారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో జనాలు ఇలానే ఆలోచిస్తున్నారంట.

Update: 2024-05-18 04:07 GMT

సంతానం విలువ ఉన్నవారి కంటే లేనివారికి ఎక్కువగా తెలుస్తుందని అంటుంటారు. కొంతమందికి పలు అనారోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టక చాలా ఇబ్బంది పడుతుంటారు.. మనోవేదనకు గురవుతుంటారు. ఇంకొంతమంది అన్నీ బాగున్నా.. పిల్లలు కనడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అంటుంటారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో జనాలు ఇలానే ఆలోచిస్తున్నారంట.

అవును... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంతాన లేమి సమస్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. ప్రధానంగా... యూరోప్, అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ప్రస్తుతం యూరోపియన్ దేశాలతో పాటు పలు ఆసియా దేశాల్లో సంతానోత్పత్తి తక్కువగా ఉండడంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో సౌత్ కొరియా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా సౌత్ కొరియాలో అత్యల్ప ఇన్ ఫెర్టిలిటీ రేట్ 0.78 శాతంగా ఉంది. ఈ ఇన్‌ ఫెర్టిలిటీ రేట్ 2025 నాటికి మరింత దగ్గే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని చెబుతున్నారు. దీంతో జనాభాను పెంచేందుకు సౌత్ కొరియా సర్కార్ సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంబంధిత మంత్రిత్వ శాఖ దంపతులకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

వాస్తవానికి సౌత్ కొరియాలో దంపతులు పిల్లలు కనడానికి ఆసక్తి చూపకపోవడానికి కారణం... కెరీర్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడమే అని ప్రభుత్వాలతో పాటు పలు కంపెనీలు కూడా భావిస్తున్నాయట. దీంతో ఓ కంపెనీ... సౌత్ కొరియాలో దంపతులు ఒక బిండను కంటే సుమారు రూ.63 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా... సియోల్‌ కు చెందిన బియోంగ్ గ్రూప్ కంపెనీ బిడ్డ పుడితే డబ్బులిస్తామని తెలిపింది.

ఇదే క్రమంలో డబ్బును నగదు లేదా గృహాల రూపంలో తీసుకోవచ్చని కంపెనీ వివరించింది. ప్రధానంగా... పిల్లల పెంపకం భారాన్ని తగ్గించేందుకే ఈ ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు సదరు కంపెనీ పేర్కొంది. ఇదే క్రమంలో... పుట్టిన పిల్లలు ఇబ్బంది పడకుండా ఇప్పటి వరకు 2,70,000 గృహాలను నిర్మించినట్లు బియోంగ్ గ్రూప్ ఛైర్మన్ లీ జూంగ్ కెయున్ తెలిపారు!

Tags:    

Similar News