స్టాలిన్ లో ఫస్ట్రేషన్ అంతకంతకూ ఎక్కువ అవుతుందా?

సార్వత్రిక ఎన్నికల వేళ పలు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-04-11 04:36 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ పలు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది తమిళనాడు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఎదుర్కోనంత వ్యతిరేకతను తమిళనాడులో ఎదుర్కోవటం తెలిసిందే. రెండేళ్ల క్రితం కూడా ఆ పార్టీకి ఎలాంటి సానుకూలత లేని పరిస్థితి. అయితే.. తాజాగా పరిస్థితి మారింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ బోణీ కొట్టటమే కాదు.. ఆసక్తికర ఫలితాలు నమోదయ్యే పరిస్థితిని నెలకొందంటున్నారు.

తాను టార్గెట్ చేసిన రాష్ట్రాలపై అమితమైన అభిమానాన్ని ప్రదర్శించటం.. ఏదో ఒక కార్యక్రమం పేరుతో సదరు రాష్ట్రంలో పర్యటించటం మోడీకి అలవాటే. అందుకు తగ్గట్లే గడిచిన ఏడాది వ్యవధిలో తమిళనాడుకు అదే పనిగా పర్యటించిన మోడీ.. తాజాగా అందుకు తగ్గ ఫలాల్ని పొందుతున్నట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు మోడీనా? అన్నట్లుగా రియాక్టు అయ్యే తమిళ ప్రజానీకం.. ఇప్పుడు మోడీ..మోడీ అంటూ నినాదాలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఎంతలో ఎంత మార్పు? అన్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదంతా నిజమా? లేదంటే అత్యాధునిక సాంకేతికత ప్రదర్శిస్తున్న మాయా? అన్న అనుమానంతో క్రాస్ చెక్ చేసినప్పుడు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో మాదిరి తమిళులు మోడీని అసహ్యించుకోవటం లేదని.. మోడీని ఏ మాత్రం నమ్మదగిన వ్యక్తిగా భావించని తమిళ ప్రజానీకం మైండ్ సెట్ లో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మాటలు బలం చేకూరుస్తున్నాయి.

తాజాగా ప్రధానమంత్రి మోడీపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు.. మోడీని వలస పక్షులతో పోల్చటం గమనార్హం. సీజన్ లో పక్షులు వలస వచ్చినట్లుగా.. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులో తిరుగుతున్నారంటూ స్టాలిన్ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మోడీ ఇస్తున్న గ్యారెంటీ స్కీంలపైనా ఆయన విమర్శలు ఎక్కు పెట్టారు.

తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ ను పెట్టిన స్టాలిన్.. తాను పోస్టు చేసిన జాబితాలోని అంశాల్ని.. సమస్యల్ని మోడీ పరిష్కరిస్తారా? అని ప్రశ్నించారు. హామీ కార్డుతో వచ్చిన మోడీ.. తాను పేర్కొన్న హామీల్ని అమలు చేస్తామని మాట ఇ్తవ్వగలరా అన్న స్టాలిన్.. ఇంతకూ ఆ జాబితాలో ఏయే అంశాల్ని ప్రస్తావించారన్నది చూస్తే.. ఆయన తెలివి ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

స్టాలిన్ పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి.. ఎన్నికల బాండ్లు.. చైనా ఆక్రమించిన భూభాగం.. కులగణన.. పౌరసత్వచట్టానికి నోటిఫై చేసి సవరణల్ని వెనక్కి తీసుకోవటం.. షెడ్యూల్ కులాలు.. తెగలు.. ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు.. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి.. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ను మినహాయించటం లాంటివి ఉన్నాయి. మోడీ మాటల ప్రవాహానికి ఏ అంశాలైతే బ్రేకులు వేస్తాయో.. వాటినే స్టాలిన్ సంధించటం గమనార్హం. మరి.. తమిళనాడు సీఎం సవాలుకు మోడీ మాష్టారు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News