యూఎస్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... పోలీస్ చీఫ్ రియాక్షన్ ఇదే!
అయితే తదనుగుణంగా పెరుగుతున్న దురదృష్టకర సంఘటనలు ఆ ఆనందాన్ని డిస్ట్రబ్ చేస్తూ.. ఆందోళనలు కలిగిస్తున్నాయి.
అమెరికాలో మాస్టర్స్ చదివే తెలుగు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తదనుగుణంగా పెరుగుతున్న దురదృష్టకర సంఘటనలు ఆ ఆనందాన్ని డిస్ట్రబ్ చేస్తూ.. ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు విద్యార్థి అగ్రరాజ్యంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు!
అవును... స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంస్ లో భారతదేశానికి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి హేమంత్ యల్లంకి క్యాంపస్ లో శవమై కనిపించాడు. హేమంత్ ఆంధ్రప్రదేశ్ లోని చిన్నకమ్మపల్లి గ్రామానికి చెందినవాడు. నార్త్ వెస్ట్ ప్రెసిడెంట్ లాన్స్ టాటం హేమంత్ యల్లంకి మరణం గురించి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి తెలియజేస్తూ సామూహిక ఇ-మెయిల్ పంపారు.
ఈ సందర్భంగా నార్త్ వెస్ట్ యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్ మెంట్ చీఫ్ క్లారెన్స్ గ్రీన్ స్పందించారు. ఇందులో భాగంగా తెలిపారు. యూనివర్శిటీ వెల్ నెస్ సెంటర్, మేరీవిల్లే కమ్యూనిటీ సెంటర్ మధ్య చెట్లతో కూడిన ప్రాంతంలో యల్లంకి మృతదేహం లభ్యమైందని అన్నారు. మృతదేహం కాన్సాస్ సిటీలో ఉందని, అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించామని ఆయన చెప్పారు.
ఇక, ఆ శవపరీక్ష ప్రాథమిక ఫలితాల నివేదిక కొన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది కానీ.. థాంక్స్ గివింగ్ కారణంగా ఆలస్యం కావచ్చని అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానం లేదని, విచారణ జరుగుతుందని అన్నారు.
మరోపక్క యల్లంకి కుటుంబానికి, మొత్తం అంత్యక్రియల ఖర్చులకు మద్దతుగా గో ఫండ్ మీ విరాళాలు సేకరించింది. ఇందులో భాగంగా ప్రస్తుతానికి 35,172 డాలర్లు సేకరించింది. ఈ నిధులు యల్లంకి మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చు, అంత్యక్రియలకు సహాయపడతాయని అంటున్నారు.