ఘోరం... కేన్సర్ చిన్నారిని గంగలో ముంచిన పేరెంట్స్!
వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన ఒక కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ.. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.
నమ్మకాలు, విశ్వాసాలు, భక్తి మొదలైనవి ముందు "మూఢ" అనే పదాన్ని తగిలించుకుంటున్నాయి! ఫలితంగా... అవి కాస్తా చాలా సందర్భాల్లో మూఢ నమ్మకం, మూఢ విశ్వాసం, మూఢ భక్తి గా మారుతున్నాయి.. ఫలితంగా వారిని మూర్ఖపు చేష్టలకు ప్రేరేపిస్తున్నాయి. ఫలితంగా.. మానవత్వం మాటున కృరత్వం తెరపైకి వస్తుంది.. ఫలితాలు కూడా తదనుగుణంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది.
అవును... ప్రస్తూతం సమాజంలో మూఢ నమ్మకాలు కూడా బలంగా పెరుగుతున్నాయని.. ఇది తిరోగమనానికి సూచిక అని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మూఢ నమ్మకం పేరుతో తాజాగా ఓ అమానవీయ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఇందులో భాగంగా... కొడుకు అనారోగ్యాన్ని నయం చేసేందుకంటూ తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన ఒక కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ.. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే మూఢ విశ్వాసాలను నమ్మే ఆ పిల్లాడి తల్లిదండ్రులు.. అతడిని హరిద్వార్ కి తీసుకుని వెళ్లాలని భావించారు. దీంతో... బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అయితే... అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న బాలుడి ఆరోగ్యం... హరిద్వార్ కు చేరుకునే సమయానికి మరింత విషమించింది.
అయినప్పటికీ తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన ఆ తల్లితండ్రులు చేయలేదు. సరికదా... హరిద్వార్ లోని హర్ కీ పౌరికి వద్దకు వచ్చి వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. అనంతరం ఆ పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. దీంతో... ఉలిక్కిపడిన పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ పట్టించుకుని వెనక్కి తగ్గని ఆ తల్లితండ్రులో ఆ గంగంలో పదేపదే ముంచారు.
ఈ సమయంలో... బాధతో, చల్లని నీటిలో ముంచడం వల్ల వచ్చిన చలితో అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ పిల్లాడు అల్లాడుతుంటే.. మూఢ నమ్మకం ఆ తల్లి మనసును విరిచేసినట్లుంది. ఈ పిల్లాడి ఆవేదనను అర్ధం చేసుకోని ఆ ఆ తల్లి... తన పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది తన వాగ్దానం అంటూ వెకిలిగా నవ్వుతూ చెబుతోంది. దీంతో... ఈ మూర్ఖపు చేష్టలకు భరించలేకపోయిన చిన్నారి చివరికి అక్కడే చనిపోయాడు.
ఈ సమయంలో ఈ భయాణక దృశ్యాలను ఘాట్ కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ లో రికార్డ్ చేశాడు. ఇదే సమయంలో అక్కడున్నవారు కొందరు పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే పోలీసులు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. దీంతో... ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లాడి తల్లితండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
దీంతో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. కొంతమంది పాలకులు, రాజకీయ నాయకులు ప్రజలకు ఇలాంటి పిచ్చిన అలవాటు చేస్తున్నారని.. రియాలిటీకి దూరంగా బ్రతికే వాతావరణన్ని సృష్టిస్తున్నారని.. అలా వారిని ప్రోత్సహిస్తున్నారని స్పందిస్తున్నారు నెటిజన్లు!