పిఠాపురం నుంచి భారీ వరద సాయం...పంపింది ఎవరంటే?

కనీ వినీ ఎరగని వరదలు వచ్చి పడ్డాయి. దాంతో బెజవాడ జల ప్రళయాన్ని ఎదుర్కొంది. ఒక్క రాత్రికే జీవితాలు జాతకాలు మారిపోయాయి.

Update: 2024-09-03 12:45 GMT

కనీ వినీ ఎరగని వరదలు వచ్చి పడ్డాయి. దాంతో బెజవాడ జల ప్రళయాన్ని ఎదుర్కొంది. ఒక్క రాత్రికే జీవితాలు జాతకాలు మారిపోయాయి. వారికి ఎంత సాయం ఎవరు చేసినా సరిపోదు, ఇదిలా ఉంటే ఒక వైపు రాజకీయ పార్టీల నాయకులు మరో వైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు తమకు తోచిన తీరున సాయం చేస్తున్నారు

ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి భారీ వరద సాయం అందింది. పిఠాపురం అంటనే ఇపుడు ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ వైబ్రేషన్స్ వస్తున్న నేపథ్యం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఏపీ అంతా తిరిగి జనసైనికులు పూనకాలు తెచ్చుకుంటున్న పరిస్థితి కూడా అంతా చూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడా కనిపించడం లేదు అన్న వార్తలు ఒక వైపు వస్తూంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి పెద్ద ఎత్తున సాయం వచ్చి పడింది.

వరద సాయం కేరాఫ్ పిఠాపురం అని కూడా దాని మీద రాసుంది. వరద బాధితులకు ఏకంగా నాలుగు టన్నుల కూరగాయలను విజయవాడకు పంపించారు. మరి ఇంత భూరి విరాళం ఎవరు ఇచ్చారు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం నియోజకవర్గం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ విధంగా వితరణ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఆయన మరింతగా సాయం చేయడానికి కూడా సిద్ధం అని చెబుతున్నారు. కరెక్ట్ టైం లో కరెక్ట్ పొలిటింగ్ టైమింగ్ తో పిఠాపురం వర్మ ఈ సాయం చేశారు అని అంటున్నారు. పిఠాపురంలో వర్మ జస్ట్ మాజీ ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నా ఇంకా అది ఏమీ వర్కౌట్ కావడంలేదు.

మరో వైపు పిఠాపురం నా అడ్డా అంటూ వర్మ ఇటీవల ప్రకటించారు. ఆయన తనదైన రాజకీయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ఉదారత అలా చాటుకుంటూ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లోకి వచ్చేశారు. అంతే కాదు ఆయన చంద్రబాబు దీక్షా దక్షతలను మెచ్చుకున్నారు. చంద్రబాబు గతంలో తుఫానులు వచ్చినపుడు ఆదుకున్నారని, ఆయనకు సైక్లోన్ క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నది బాగా తెలుసు అని వర్మ కితాబు ఇచ్చారు.

ఇపుడు కూడా విజయవాడ ముప్పు నుంచి కాపాడడం బాబుకే సాధ్యం అని వర్మ అంటున్నారు. మొత్తం మీద చూస్తే పిఠాపురం వర్మ బెజవాడ వరద బాధితులకు సాయం చేయడం ద్వారా పిఠాపురాన్ని మరోసారి వార్తలలో నిలిపారు అని అంటున్నారు.

Tags:    

Similar News