ఏపీలో ఇదే ఆఖరు పుట్టినరోజు.. తెలంగాణ కోకాపేటకు షిఫ్టు అవుతున్నా

వచ్చే ఏడాది షష్టిపూర్తిని హైదరాబాద్ మహానగర శివారులోని కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో జరుపుకోనున్నట్లు వెల్లడించారు

Update: 2023-11-18 04:51 GMT

విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాదు.. ఆయనకు తన ఆశీస్సులు అందించేందుకు సిద్ధంగా ఉండే ఆయన తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తాజాగా ఆయన తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇదే తన చివరి పుట్టినరోజు వేడుకగా పేర్కొన్నారు.

వచ్చే ఏడాది షష్టిపూర్తిని హైదరాబాద్ మహానగర శివారులోని కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో జరుపుకోనున్నట్లు వెల్లడించారు. అక్కడే ఉండి.. ఆదిశంకురల అద్వైత తత్త్వంపై పరిశోధనలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. తాను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు అయ్యిందని.. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని స్రష్టించేలా విశాఖ శారదాపీఠాన్ని తీర్చిదిద్దిన విషయాన్ని ప్రస్తావించారు.

తాను అధ్యయన కేంద్రంలో ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటానని.. పీఠం బాధ్యతల్ని వచ్చే ఏడాది పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతికి అప్పగించనున్నట్లు చెప్పారు. మిగిలిన విషయాలన్ని బాగున్నా.. వచ్చే ఏడాది నుంచి ఏపీ నుంచి తెలంగాణకు సాములోరు షిప్టు కావటం చర్చనీయాంశంగా మారింది. ఆ పరిశోధనలు ఏవో.. విశాఖలో ఉండి చేసుకోవచ్చు కదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News