అరుదైన రికార్డ్ నెలకొల్పిన చిన్న దేశం.. మరింత దిగజారిన భారతదేశం..

అంతేకాదండోయ్ స్విస్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్విస్ బ్యాంక్.. అదేనండి రాజకీయ నాయకుల బ్లాక్ మనీ అడ్డ.

Update: 2024-09-10 15:59 GMT

ప్రకృతి మధ్యలో సేద తీరాలి అని మన అందరికీ ఉంటుంది. చుట్టుపచ్చని ప్రకృతి.. అందమైన కొండలు.. జోరున సాగే జలపాతాలు.. ఈ వర్ణన విన్న ప్రతిసారి చాలామంది మనసులో మెదిలే ప్రదేశం స్విట్జర్లాండ్. ప్రకృతి శోభతో ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణంలో నిండి ఉండే స్విట్జర్లాండ్ టూరిస్టులకు హెవెన్ లాంటిది. స్విట్జర్లాండ్ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికుల కళ్ళ ముందు అందమైన ఆల్ప్స్ కదలాడక మానవు. అంతేకాదండోయ్ స్విస్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్విస్ బ్యాంక్.. అదేనండి రాజకీయ నాయకుల బ్లాక్ మనీ అడ్డ.

పేరుకు చిన్న దేశమే అయిన పర్యాటకులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేశం మరొక అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన 'బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024'లో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అయితే ఇలా మొదటి స్థానం రావడం ఇది తొలిసారి కాదు.. ముచ్చటగా మూడోసారి ఈ ఘనత స్విట్జర్లాండ్ కు దక్కడం విశేషం.

దీనికి ముఖ్య కారణం అక్కడ ఉండే ప్రకృతి శోభతో పాటు, వ్యాపార అవకాశాలు, లైఫ్ స్టైల్, సాంస్కృతి, సాంప్రదాయాలు. ఇలా 73 విభిన్న లక్షణాల తో 10 విభిన్న ప్రమాణాలు ఉపయోగించి 89 దేశాలతో ఈ జాబితాను రూపొందించడం జరిగింది. అయితే అన్ని విభాగాలలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచి ఫస్ట్ ప్లేస్ లో కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఏడుసార్లు స్విస్ బెస్ట్ కంట్రీ గా నెంబర్ వన్ ర్యాంక్ సాధించి ప్రపంచ దేశాల కు ఆదర్శంగా నిలుస్తోంది.

ఇక ఈ పట్టీలో జపాన్ రెండవ స్థానంలో నిలవగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మొదటి ఐదు స్థానాలలో చోటు దక్కించుకున్నాయి. ఈ టోటల్ జాబితాలో ఇండియా మాత్రం 33వ ప్లేస్ కి పరిమితం అయింది. గత ఎడాది 30 వ స్థానంలో ఉన్న ఇండియా ఈసారి మూడు స్థానాలు తగ్గి 33వ స్థానానికి పడిపోయింది. మన పురుగు దేశాలైన సింగపూర్, చైనా, దక్షిణ కొరియా టాప్ 25 లో ప్లేస్ దక్కించుకున్నాయి. మనకంటే ఎంతో చిన్న దేశం చూపిస్తున్న స్థిరత్వం మన దేశం ఎప్పుడు చూపిస్తుందో చూడాలి.

Tags:    

Similar News