చావు కి కూడా వింత వింత టెక్నాలజీ తయారు చేస్తున్నారా?
మనిషిగా జన్మించడం ఓ అదృష్టం అని.. అది వరం అని.. ఆయుస్సు తీరేవరకూ బ్రతుకుతూ, ప్రతి మంది బ్రతకడానికి సాయపడుతూ.. కాలం చేయాలని చాలా మంది కోరుకుంటారు.. పది మందికి చెబుతుంటారు.
మనిషిగా జన్మించడం ఓ అదృష్టం అని.. అది వరం అని.. ఆయుస్సు తీరేవరకూ బ్రతుకుతూ, ప్రతి మంది బ్రతకడానికి సాయపడుతూ.. కాలం చేయాలని చాలా మంది కోరుకుంటారు.. పది మందికి చెబుతుంటారు! అయితే కొంతమంది మాత్రం సమస్యలు వచ్చాయని.. కష్టాలు ఎదురయ్యాయని.. అనుకున్నవి జరగడం లేదని.. కోరుకున్నవి దక్కడం లేదని బలవన్మరణాలకు పాల్పడుతుంటారు.
అవును... ఆత్మహత్యలు అనేవి ఏమాత్రం సరైన ఆలోచన కాదని.. అది ఏ సమస్యకూ పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని.. అలాంటప్పుడు ఆ ఆలోచన చేయడమే వృథా అని.. ఏదైనా బ్రతికి సాధించాలని.. చచ్చి సాధించేది ఏమీ ఉండదు, వెనకున్నవారికి తీరని వేదన కలిగించడం తప్ప అని అంటారు. అయితే... మరోపక్క ఆత్మహత్యలకు సులువైన మార్గం ఒకటి కనిపెట్టిందంట స్విట్జర్లాండ్!!
అసిస్టెడ్ డైయింగ్ కోసం వాదించే ఓ సమూహం... స్విట్జర్లాండ్ లో మొదటిసారిగా పోర్టబుల్ సూసైడ్ పాడ్ ను ఉపయోగించవచ్చని ప్రకటించిందని.. దీనివల్ల వైద్య పర్యవేక్షణ లేకుండానే తమ జీవితాలను ప్రశాంతంగా ముగించవచ్చని స్విస్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఈ ఆలోచన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుందని అంటున్నారు.
"సార్కో క్యాప్సూల్" అని పిలవబడే నైట్రోజన్ నింపిన ఈ బాక్స్ లోపల పడుకుని బటన్ నొక్కితే ఒక్క నిమిషంలోనే చనిపోతారంట. దీన్ని ఉపయోగించడానికి 20 డాలర్లు (సుమారు 1673 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందంట. "ది లాస్ట్ రిసార్ట్" అనే సంస్థ స్విట్జర్లాండ్ లో ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులూ లేవని నివేదించింది!
కాగా... ఎక్కువమంది క్షణికావేశంలోనే అత్మహత్యలు చేసుకుంటారని అంటారు! ఆ సమయంలో వారిని ఎవరైనా ఆపితే.. ఆ క్షణం గడిచిపోతుంది.. వాళ్లు మళ్లీ ఆ ఆలోచన చేయరని అంటుంటారు! ఆత్మహత్య చేసుకొవాలనే వారి ఆలోచన మార్చే పరికరాలు కావాలి కానీ.. ఇలాంటివి ఎందుకనేది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా చెబుతున్నారు!