టి.కాంగ్రెస్స్ లో అనూహ్య మార్పులు... తాజా సర్వే ఫలితాలివే!

అవును... లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్స్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2023-12-25 09:33 GMT

రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహాన్ని, అక్కడ అనుసరించిన వ్యూహాలనూ కంటిన్యూ చేసిన కాంగ్రెస్.. తెలంగాణలోనూ విక్టరీ సాధించింది. దీంతో.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలో టి.కాంగ్రెస్ లో అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి!

అవును... లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్స్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ ఛార్జిగా మాణిక్‌ రావ్‌ ఠాక్రే ను మార్చడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతలందరినీ సమన్వయం చేసి ఆయన విజయపథం వైపు నడిపించారు.

దీంతో వచ్చే ఏడాదిలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికల వరకూ కూడా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ ఛార్జిగా ఆయనే ఉంటారని కాంగ్రెస్‌ నేతలు భావించారు. అయితే... ఉన్నపలంగా అధినాయకత్వం ఆయనను మారించింది. ఈయన స్థానంలో ఇంతకాలం తెలంగాణకు ఏఐసీసీ పరిశీలకురాలిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ఎంపీ దీపా దాస్ మున్షీని నియమించింది. పశ్చిమ బెంగాల్‌ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ భార్యే దీపా దాస్ మున్షీ!

ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ లో ఉన్న వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అండగా నిలిచిన ఠాక్రే ఆశ్చర్యకరంగా మార్చబడటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత 6 నెలలుగా ఆమె ఏఐసీసీ తరఫున హైదరాబాద్‌ లోనే ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై పట్టు సాధించిన దీపా దాస్... జిల్లాల్లో పార్టీ పరిస్థితి మీద కూడా అవగాహన సంపాదించారని తెలుస్తుంది.

ఇక టీపీసీసీ చీఫ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం మార్పుల ఆలోచన చేయలేదని తెలుస్తుంది. దీంతో... లోక్‌ సభ ఎన్నికల వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌ సభ ఎన్నికల అనంతరం తిరిగి పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఏబీపీ-సీ ఓటర్‌ తాజా సర్వే!:

రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశాలున్నాయని ఏబీపి-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. ఇందులో భాగంగా... తెలంగాణలో మొత్తం 17 లోక్‌ సభ స్థానాలకు గానూ 9-11 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని తాజా సర్వేలో తేలిందని చెబుతుండి.

ఇక 2019లో తొమ్మిది లోక్‌ సభ స్థానాలను గెలుచుకున్న బీఆరెస్స్ కు 3 నుంచి 5 ఎంపీ సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొంది. ఇదే సమయంలో... బీజేపీకి 1-3 లోక్‌ సభ స్థానాలకు మించి రాకపోవచ్చని ఆ సర్వే పేర్కొంది!

Tags:    

Similar News