ఎమ్మెల్సీ పదవుల గంప... మూడు పార్టీలకూ పంట

ఇందులో నాలుగు వైసీపీ నుంచి రాజీనామాలు చేసిన వారి పోస్టులు కూడా ఉన్నాయి.

Update: 2024-12-20 11:30 GMT

మరో మూడు నెలలు కళ్ళు మూసుకుంటే చాలు కూటమిలోని ఆశావహులకు మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. ఎందుకంటే శాసనమండలిలో మార్చి నెలలో ఒకేసారి ఏకంగా 13 ఖాళీలు ఏర్పడబోతున్నాయని అంటున్నారు. ఇందులో నాలుగు వైసీపీ నుంచి రాజీనామాలు చేసిన వారి పోస్టులు కూడా ఉన్నాయి.

వైసీపీ నుంచి రాజీనామాలు చేసిన కర్ర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకట రమణ ఖాళీలను మార్చిలో చూపించే చాన్స్ ఉంది అంటున్నారు. అలాగే పదవీకాలం పూర్తి అయిన వారి ఖాళీలు ఎటూ ఉంటాయి. మరి కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేసారు అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ పదవుల గంప అన్నది రెడీగా ఉంటోంది చెబుతున్నారు.

అయితే వాటికి మించి ఆశావహుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నాయి. ఇప్పటికే ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పదవులను చెరొకటి వంతున టీడీపీ జనసేన పంచుకున్నాయి. ఇక పట్టభద్రుల సీట్లలో పూర్తిగా టీడీపీయే పోటీ చేసింది.

దాంతో ఈసారి పదవులలో ఒకటి అయినా తమకు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. అలాగే జనసేన నుంచి నాగబాబు కన్ఫర్మ్ గా ఉంటారు. వీలైతే ఆయంతో పాటు మరొకరికి అయినా అడగాలని జనసేన భావిస్తోంది. ఆ రెండవ పదవి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని అంటున్నారు.

టీడీపీ విషయానికి వస్తే మాత్రం నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది బిగ్ షాట్స్ కాచుకుని కూర్చున్నారు అని అంటున్నారు. వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. అలాగే సీటు త్యాగం చేసిన పిఠాపురం వర్మ, వంగవీటి రాధాక్రిష్ణ, రెడ్డి సుబ్రమణ్యం గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, బీద రవిచంద్ర, టీడీ జనార్ధన్, బుద్ధా వెంకన్న, సుగుణమ్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి.

ఇక రాజ్యసభ సీటుని త్యాగం చేసి మరీ టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరాల్సిందే అని అంటున్నారు. అలా ఆయనకు కంఫర్మ్ అయితే బీజేపీ జనసేనలకు కలిపి రెండూ లేదా మూడు పోతే టీడీపీకి అచ్చంగా మిగ్లిఏది తొమ్మిది వరకూ మాత్రమే అంటున్నారు.

మరో వైపు ఈ పేర్లతో పాటు కొత్తగా మరిన్ని పేర్లు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన వారు కూడా తమకు చాన్స్ కావాలని అడగవచ్చు అని అంటున్నారు. దాంతో పదవులు దండీగా ఉన్నా అంతకు మించి ఆశావహుల ఆశలు కూడా ఉన్నాయని అంటున్నారు. వీటిని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా ఇక మీదట వచ్చే ఏ పదవి అయినా కూటమికే దక్కుతాయి కాబట్టి రేసులో వైసీపీ లేదు కాబట్టి దఫాల వారీగా భర్తీ చేసి అందరికీ న్యాయం చేసేలాగానే కూటమి పెద్ద చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. అంతే కాదు త్యాగాలను సీనియారిటీని విధేయతను పరిగణనలోకి తీసుకుని పదవులు భర్తీ చేస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News