బీజేపీలోని టీడీపీ మాజీలు...జంపింగ్ కి ముహూర్తం ఫిక్స్...?
దాంతో ఎన్నికల ముందుగా రాజకీయ గాలి ఏ వైపు వీస్తుంది అన్నది చూసుకునే ఈ బ్యాచ్ అంతా తమ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటుంది అని అంటున్నారు.
టీడీపీలో పెద్ద తలకాయలుగా అధినాయకత్వం తలలో నాలుకగా ఉన్న కొందరు కీలక నేతలు టీడీపీ ఇలా ఓటమి పాలు కాగానే అలా కమలం గూటికి చేరిపోయారు. వారంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. వారిని చూసిన వారు అంతా రాజకీయాల్లో ఇలా జరిగిందేంటి అని అనుకున్నారు. అది కూడా బాబు అమెరికా ట్రిప్ లో ఉండగా ఇది జరిగింది.
చిత్రమేంటి అంటే వారు పార్టీ వదిలేసి వెళ్ళినా చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎవరూ వారి మీద పెద్దగా విరుచుకుపడి విమర్శలు చేయలేదు. అలాగే వెళ్ళిన వారు కూడా చంద్రబాబు గురించి పల్లెత్తు మాట అనలేదు. దాంతో బాబే వారిని బీజేపీలోకి పంపించారని ప్రచారం సాగింది. వైసీపీ నేతలు కూడా పదే పదే ఇదే అంటూ వచ్చారు.
మొత్తానికి నాలుగేళ్ల కాలం పూర్తి అయింది. బీజేపీలోకి వెళ్ళిన వారు ఏమీ బావుకోలేదు. కనీసం ఏ ఒక్కరికీ రాజ్యసభ సీటు రాలేదు. తాము ఇలా పార్టీ మారితే ఆలా కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించినా అది కూడా దక్కలేదు. చివరికి సుజనా చౌదరి లాంటి వారు రాజ్యసభ పదవీకాలం అయిపోగానే సైలెంట్ అయిపోయారు. పార్టీ బాధ్యతలలో కూడా వారిని కీలకం చేయలేదు. టోటల్ గా చూస్తే అలా వెళ్ళిన వారిలో కర్నూల్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కర్నూల్ టీడీపీ క్యాండిడేట్.
అలాగే కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. ఇలా చాలా మందికి బంధాలు అనుబంధాలు టీడీపీతోనే ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ కూడా టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారని అంటున్నారు. ఆయన పదవీ కాలం 2024 ఏప్రిల్ దాకా ఉంది.
ఇక మరో నాలుగు నెలలలో లోక్ సభ ఎన్నికలకు నగారా మోగనుంది. దాంతో ఎన్నికల ముందుగా రాజకీయ గాలి ఏ వైపు వీస్తుంది అన్నది చూసుకునే ఈ బ్యాచ్ అంతా తమ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటుంది అని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచి దేశంలో కూడా మెజారిటీ స్టేట్స్ ఆ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ నాయకత్వంలోకి ఇండియా కూటమి వైపుగా ఈ బ్యాచ్ మళ్ళుతుందని అంటున్నారు.
అలా టీడీపీలో చేరి డైరెక్షన్ మార్చుకుంటుందని కూడా అంటున్నారు. ఇక సీన్ వేరే విధంగా ఉంటే ఎన్డీయే మళ్లీ వచ్చే చాన్స్ ఉంటే బీజేపీ టీడీపీ బంధాన్ని ఎన్నికల వేళ పొత్తు రూపంలో కలిపేందుకు కూడా విశేష కృషి చేస్తుందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా కూడా టీడీపీలోకి ఈ బ్యాచ్ మళ్ళీ వచ్చి తీరుతుందని మాత్రం చెబుతున్నారు.
దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల ముందు పాత వారు అంతా సైకిలెక్కేస్తారు అని అంటున్నారు. అందులో అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా ఏ పార్టీలోకి వెళ్ళినా వారంతా తిరిగి టీడీపీ గూటికే చేరుతారని అంటున్నారు. చూడాలి మరి ఈ జంపింగ్స్ కి ఎపుడు టీడీపీ గేట్లు తెరుస్తుందో.