2019 లెక్క రిపీట్‌! అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ!!

దీంతో 2019లో వైసీపీకి వ‌చ్చిన రిజ‌ల్ట్.. ఇప్పుడు టీడీపీ కూట‌మికి వ‌స్తుంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Update: 2024-06-04 05:22 GMT

ఏపీలో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌కొన‌సాగుతోంది. అయితే.. రౌండు రౌండుకుకూడా.. టీడీపీ కూట‌మి పుంజు కుంది. వాస్త‌వానికి నెక్ టు నెక్ అన్న‌ట్టుగా ఎన్నిక‌ల్లో ట‌ఫ్ ఫైట్ క‌నిపిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ముంద‌స్తు నుంచి ఇదే అంచ‌నా వ‌చ్చింది.. అయితే.ఫ‌లితాల వెల్ల‌డి త‌ర్వాత‌.. ఈ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా కూడా.. నెక్ టు నెక్ ప‌రిస్థితి లేదు. ఏక‌ప‌క్షంగా నే టీడీపీ కూట‌మి ముందుకు దూసుకు పోతోంది. దీంతో 2019లో వైసీపీకి వ‌చ్చిన రిజ‌ల్ట్.. ఇప్పుడు టీడీపీ కూట‌మికి వ‌స్తుంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌డ‌ప‌టి వార్త‌లు అందే స‌రికి.. టీడీపీ కూట‌మి.. 153 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. అదేవిధంగా వైసీపీ మాత్రం 20 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది. దీంతో ఎన్డీయే కూట‌మి ఏక‌ప‌క్షంగా దూసుకుపోతున్న‌ట్టు అయింది. కూట‌మి పార్టీల విష‌యాన్ని చూస్తే.. జ‌న‌సేన 19, బీజేపీ 7 స్థానాల్లో లీడ్‌లో ఉంది. వాస్త‌వానికి జ‌నసేన పోటీ చేసింది 21 స్థానాల్లో కావ‌డం.. 19 స్థానాల్లో పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బీజేపీ కూడా 10 స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేసింది. ఇప్పుడు 7 చోట్ల లీడ్ లో ఉంది .

ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. లీడ్‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఎన్డీయే కూట‌మి వైపు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ 15-20 స్థానాల‌కే వైసీపీ ప‌రిమిత‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, కుప్పంలో చంద్ర‌బాబు, పిఠ‌పు రంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, పులివెందుల‌లో జ‌గ‌న్‌లు మాత్రం ముందంజ‌లో ఉన్నారు.

ఇక‌, లోక స‌భ ఎన్నిక‌ల‌కు వ‌చ్చినా టీడీపీ కూట‌మి దూసుకుపోతోంది. మొత్తం 25 స్థానాల్లో కూట‌మి పార్టీలు.. 22 స్థానాల్లో దూసుకుపోతున్నాయి కేవ‌లం 3 స్థానాల్లో మాత్ర‌మే వైసీపీ ముందుకు ఉంది. అయితే.. జ‌న‌సేన పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుక‌బ‌డింది. పురందేశ్వ‌రి పోటీ చేసిన రాజ‌మండ్రిలో బీజేపీ, న‌ర‌సాపురంలో పోటీలో ఉన్న బీజేపీ కూడా ముందంజ‌లో ఉంది. అయితే.. చిత్రంగా.. క‌డ‌ప‌లో మాత్రం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల వెనుక‌బ‌డ్డారు. ఇక్క‌డ ఆమె కొంగు చాపి.. క‌న్నీళ్లు పెట్టుకుని ఓట్లు అడిగిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ‌లో

తెలంగాణ‌లో బీజేపీ దూకుడుగా ఉంది. మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 9 చోట్ల‌, కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్‌లో ఉండ‌గా.. హైద‌రాబాద్‌లో మాత్రం ఎంఐఎం దూసుకుపోతోంది.

Tags:    

Similar News