మ్యానిఫెస్టో డౌటేనా ?
రాబోయే దసరా పండుగ నాటికి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో డౌటే. రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మినీ మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే.
రాబోయే దసరా పండుగ నాటికి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో డౌటే. రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మినీ మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. మినీ మ్యానిఫెస్టో పేరుతో ఆరు హామీలను ప్రకటించి వాటిని సూపర్ సిక్స్ అని ప్రకటించారు. పూర్తిస్థాయి మేనిఫెస్టో పై కసరత్తు చేసి దసరా పండుగకు మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు అప్పట్లో చెప్పారు. దానికి తగ్గట్లే మేనిఫెస్టో రెడీ చేయడానికి కమిటీలను కూడా నియమించారు.
అయితే సడెన్ గా స్కిల్ స్కామ్ లో పోయిన నెలలో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్నారు. మరో 14 రోజులు రిమాండులో నుండి బయటకు వచ్చే అవకాశంలేదు. చంద్రబాబు ఎప్పుడైతే అరెస్టయ్యారో అప్పటినుండి పార్టీ కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి. దాంతో దసరాపండుగకు పూర్తిస్ధాయి మ్యానిఫెస్టో ప్రకటన అసాధ్యమని తేలిపోయింది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు ఖాయమైపోయింది. అందుకనే రెండు పార్టీలు దేనికది కాకుండా ఉమ్మడిగా మ్యానిఫెస్టోని రెడీ చేయాలని డిసైడ్ అయ్యింది.
ఈ విషయంపైనే జనసేన అదినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు రెండుపార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో రెడీ అవుతుందని ప్రకటించారు. రెండుపార్టీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించేట్లయితే మరి ఇంతకాలం చంద్రబాబు, పవన్ విడివిడిగా ప్రకటించిన హామీల మాటేమిటి అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను ఉమ్మడి మ్యానిఫెస్టోలో చేర్చుతారా ? లేకపోతే వాటినే మరోరూపంలో మ్యానిఫెస్టోలో పెడతారా అన్న విషయంలో క్లారిటిలేదు. చంద్రబాబు బెయిల్ పై విడుదల అయ్యేంతవరకు టీడీపీ తరపున మ్యానిఫెస్టోపై కసరత్తు జరిగే అవకాశం లేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
కానీ పవనేమో ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తామని ప్రకటించారు. నిజానికి మ్యానిఫెస్టోపై కసరత్తు చేసేంత సీనున్న నేతలు జనసేనలో ఎవరున్నారో అర్ధంకావటంలేదు. మ్యానిఫెస్టోపై ఏమి కసరత్తు జరిగినా టీడీపీ తరపున జరగాల్సిందే. టీడీపీ తరపున కూడా మ్యానిఫెస్టోపై షో టైమ్ సంస్ధ నిపుణులే కసరత్తులు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఎక్కడ కసరత్తు అక్కడే ఆగిపోయింది. ఒకవైపేమో ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. మరోవైపేమో చంద్రబాబు విడుదల అనిశ్చితిగా తయారైంది. ఈ నేపధ్యంలోనే మ్యానిఫెస్టోపై ఏమిచేస్తారో చూడాల్సిందే.