జగన్ రాకకు మోకాలడ్డుతున్న గంటా...?

విశాఖకు జగన్ మకాం మారుస్తాను అంటే అందరి కంటే గట్టిగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సౌండ్ చేస్తున్నారు.

Update: 2023-09-24 03:49 GMT

విశాఖకు జగన్ మకాం మారుస్తాను అంటే అందరి కంటే గట్టిగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సౌండ్ చేస్తున్నారు. జగన్ విశాఖ రావడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దాని వల్ల ప్రజలకు ఇబ్బందులే అంటున్నారు. గంటా జగన్ మీద ఈ తరహా విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు, జగన్ ఎపుడు విశాఖలో మకాం అన్నా కూడా ఆయన ఈ రకంగానే రియాక్ట్ అవుతున్నారు.

విశాఖ వైసీపీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు, లా అండ్ ఆర్డర్ విశాఖలో దెబ్బ తింది, సీఎం జగన్ విశాఖ లో నివాసం అన్న ఆలోచనలు విరమించుకుంటే మంచిది అని కూడా గతంలో గంటా అన్నారు. గంటా మాదిరిగా టీడీపీలో మరే నేతా జగన్ విశాఖ రాకను ఇంత ఎక్కువగా ప్రస్తావించి వ్యతిరేకించడంలేదు.

అసలు ఎందుకు మాజీ మంత్రి ఈ విధంగా చేస్తున్నారు అంటే జగన్ విశాఖలో ఉంటే వైసీపీకి రాజకీయంగా మేలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సీఎం ఉన్న చోట కచ్చితంగా పొలిటికల్ మైలేజ్ వస్తుంది. అదే విధంగా విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీకి మోరల్ సపోర్ట్ వస్తుంది.

క్యాడర్ కి భరోసా వస్తుంది.దాంతో పాటు ఉత్తరాంధ్రా ప్రజలకు రాజధాని కల తీరడం వల్ల పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే చాన్స్ ఉంది. ఈ పరిణామాలను అంచనా వేస్తూనే గంటా ఇలా రియాక్ట్ అవుతున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. మరో వైపు ఉత్తరాంధ్రాలో తానే టీడీపీకి ధీటైన నాయకుడిని అని చెప్పుకోవడానికి కూడా గంటా ఈ రకంగా ప్రకటనలు ఇస్తున్నారు అని అంటున్నారు.

అంటే తెలుగుదేశంలో అధిపత్య పోరులో తనదే పై చేయి కావాలన్న ఆలోచనతోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అయితే గంటా మూడు రాజధానుల టైం లో మొదట స్వాగతించిన సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేసి ఆనాడు అలా ఈనాడు ఇలా ఎందుకు ఇలా అని సెటైర్లు వేస్తున్నారు. అప్పట్లో గంటా వైసీపీలోకి రావాలని ప్రయత్నాలు చాలా చేశారని అందులో భాగంగా ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడారని, ఇపుడు టీడీపీలో ఉండాలని నిర్ణయించుకుని ఈ కొత్త స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటున్నారు

జగన్ విశాఖలో మకాం పెడితే ప్రజలకు ఏమిటి ఇబ్బందో గంటా చెప్పాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అని ప్రశ్నిస్తున్నారు. విశాఖ రాజధాని మీద టీడీపీ స్టాండ్ ఏంటి అని కూడా నిలదీస్తున్నారు. మొత్తానికి గంటా సీఎం ని వ్యతిరేకిస్తూ ఇస్తున్న స్టేట్మెంట్స్ తో తన రాజకీయాన్ని రక్తి కట్టించుకోవాలని చూస్తున్నారు అని వైసీపీ అంటోంది.

Tags:    

Similar News