చివరకు రిజెక్టెడ్ నేతలకూ ఓకే అంటున్న బాబు

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది నాయ‌కులు టీడీపీవైపు చూస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

Update: 2024-01-19 17:30 GMT

కొన్ని కొన్ని న‌మ్మకాలు.. చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. ఆర్థికంగా బ‌లంగా ఉన్నార‌ని.. లేదా.. సామాజిక వ‌ర్గం ప‌రంగా బాగున్నార‌ని.. న‌మ్మి నాయ‌కుల‌ను చేర్చుకుంటే.. వారి వ‌ల్ల ఉన్న పార్టీ కేడ‌ర్ కూడా.. దెబ్బ‌తిన‌డం ఖాయమ‌నే వాద‌న రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపిస్తూ ఉంటుంది. పోనీ.. వారికి సొంత కేడ‌ర్ ఉంటే ఫ‌ర్వాలేదు. కానీ, అలా కాకుండా పార్టీల‌పై ఆధార‌ప‌డితే మాత్రం.. ఇబ్బందులు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది నాయ‌కులు టీడీపీవైపు చూస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది మంచిదే కావొచ్చు. ఎన్నిక‌ల‌కు ముందు నాయ‌కులు పొరుగు పార్టీల‌నుంచి రావ‌డంవ‌ల్ల ఆయా పార్టీలు బ‌ల‌హీన‌ప‌డి.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని టీడీపీ భావించ‌నూ వ‌చ్చు. కానీ,వ‌స్తున్న నాయ‌కుల హిస్ట‌రీని గ‌మ‌నిస్తే.. మాత్రం ఇలాంటి వారిని చేర్చుకోకుండా ఉండడమే బెట‌ర్ అని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌తంలో ఇదే టీడీపీకి హ్యాండిచ్చిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. ప్ర‌స్తుతం ఒంగోలు ఎంపీమాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు ఠారెత్తుతోంది. ఆయ‌న త్వ‌ర‌లో నే టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు వైసీపీ టికెట్ ఇచ్చేం దుకు స‌సేమిరా అంటోంది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న వేచి చూసే ధోర‌ణిలోనే ఉన్నారు. ఇక‌, ఇప్ప‌టికే దాదాపు తేల్చేసిన నేప‌థ్యంలో ఆయ‌న చూపు టీడీపీవైపు ఉంద‌ని తెలుస్తోంది. దీంతో విధిలేని ప‌రిస్థితిలో ఆయ‌న టీడీపీ చెంత‌కు చేరే ఛాన్స్ ఉంది.

కానీ, 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప‌రిణామాలు గుర్తు చేసుకుంటే.. టీడీపీ ఆయ‌న‌కు చోటు పెట్ట‌కూడదు. 2014లోనే ఆయ‌న టీడీపీ చెంత‌కు చేరారు. అప్ప‌ట్లోనే ఎంపీ సీటు ఇచ్చారు. కానీ, ఆయ‌న ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంత‌గా గౌర‌వించిన పార్టీని 2019లో తృణ ప్రాయంగా తీసేసి.. వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఇక‌, ఇప్పుడు అక్క‌డ టికెట్ లేద‌ని.. ఇక్క‌డ‌కు వ‌స్తున్నారు. ఈయ‌న వ‌ల్ల టీడీపీకి ఒరిగింది కానీ.. మేలు జ‌రిగింది కానీ.. ఏమీ లేదు.

పైగా ఇప్పుడుఈయ‌న‌ను తీసుకుంటే.. పార్టీ కేడ‌ర్ కూడా దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. వేరే కొత్త‌వారికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటా మ‌ని స్థానిక కేడ‌ర్ చెబుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ ఆలోచించి అడుగులు వేయ‌డం మంచిద‌ని అంటున్నారు.

Tags:    

Similar News