4 గంటల రేవంత్ టీం మధనం.. ఏమేం నిర్ణయాలు తీసుకున్నారంటే?

ఏదో చేద్దామనుకుంటే మరేదో అయినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిస్థితి. హైడ్రాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు..

Update: 2024-10-27 07:33 GMT

ఏదో చేద్దామనుకుంటే మరేదో అయినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిస్థితి. హైడ్రాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో రేవంత్ సర్కారు తీసుకొచ్చిన వ్యవస్థ అందరిని ఆకర్షించింది. అయితే.. ఆరంభంలో ప్రదర్శించిన హడావుడి హైడ్రాకు శాపంగా మారింది. భారీగా వచ్చిన క్రేజ్ ను హ్యాండిల్ చేసే విషయంలో హైడ్రా తప్పులు చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం వెళ్లకుండా.. సంచలనాలతో మరింత పేరు ప్రఖ్యాతుల్నిసొంతం చేసుకోవాలని తపించింది. ఇందులో భాగంగా నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నట్లు చెప్పినా.. రూల్ బుక్ లోని సంక్లిష్టతను.. స్థానికంగా ఉండే పరిస్థితుల్ని.. అన్నింటికి మించిన ప్రజల ఎమోషన్ ను అర్థం చేసుకునే విషయంలో జరిగిన పొరపాటు.. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

దీంతో.. ఎంత దూకుడుగా హైడ్రా బుల్డోజర్లు అక్రమకట్టడాల మీద దూసుకొచ్చాయో.. అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి. వినాయక చవితి తర్వాత దసరా వచ్చింది. వెళ్లింది. మరో నాలుగైదు రోజుల్లో దీపావళి వచ్చేస్తున్న వేళలోనూ చడీ చప్పుడు చేయకుండా కామ్ గా ఉండిపోయింది హైడ్రా. నిజానికి హైడ్రాతో రేవంత్ సర్కారుకు మొదట్లో మంచి గుర్తింపే వచ్చింది. ప్రముఖుల నుంచి సామాన్యుల మీదకు బుల్డోజర్లు రాగానే.. అప్పటివరకు వావ్ అన్న నోళ్లే.. హాహాకారాలు చేశాయి. దీంతో.. హైడ్రా కారణంగా పడిన మరకను తుడుచుకునే ప్రయత్నంలో మునిగిపోయింది రేవంత్ సర్కారు.

తాజాగా కేబినెట్ భేటీ నిర్వహించిన సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను.. డెవలప్ మెంట్ మీదనే తమ ఫోకస్ అన్న సంకేతాల్ని ఇచ్చేలా నిర్ణయాలు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు రేవంత్ సర్కారు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అయిన హైడ్రా.. మూసీ ప్రక్షాళన.. ఫోర్త్ సిటీకి భిన్నంగా కేబినెట్ తాజా నిర్ణయాలు ఉన్నాయి. నాలుగు గంటల పాటు నాన్ స్టాప్ గా సాగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే..

- 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిల్లో ఒక డీఏను ఇవ్వాలన్న నిర్ణయం.

- ఆర్థిక పరిస్థితి కుదుట పడగానే అన్నింటిని క్లియర్ చేస్తాం.

- జీవో 317, జీవో 46 పై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘంగా చర్చ. సదూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి మెడికల్.. స్పాజ్.. మ్యూచువల్ బదిలీలకు ఓకే

- నవంబరు 30 వరకు రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి చేయాలి. నవంబరు 4 నుంచి 19 వరకు రాష్ట్ర మంతా ఇంటింటి సర్వే చేపట్టాలి. ఇందుకోసం దాదాపు 80 వేల ఎన్యూమరేటర్లను సర్వే విధులకు డిప్యూట్ చేస్తారు.

- ఒక్కో ఎన్యూమరేటర్ నిర్ణీత గడువు లోగా 150 ఇళ్ల నుంచి వివరాలు సేకరించాలి.

- కులగణన సమగ్ర సమాచారాన్నిసేకరించి.. పబ్లిక్ డొమైన్ లో ఉంచుతాం.

- ధాన్యం సేకరణకు సుమారు 6వేలకు పైగా కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కొన్నిఏర్పాటు. మిగిలిన వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తాం.

- గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ల వద్ద రూ.20వేల కోట్ల ధాన్యం మిగిలిపోయింది. ఇప్పటికీ డిఫాల్టర్లుగా ఉన్న వారిని మొత్తంగా తొలగించాలని నిర్ణయించాం. మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించేటప్పుడు వారిస్థాయిలను ఆధారంగా బ్యాంకు గ్యారెంటీలు తీసుకుంటుంది.

- హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ కు ఓకే.

- నాగోల్ - శంషాబాద్, రాయదుర్గం - కోకాపేట్, ఎంజీబీఎస్ - చాంద్రాయణ గుట్ట, మియాపూర్ - పటాన్ చెరువు, ఎల్ బీ నగర్ - హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల వరకు విస్తరణ చేపట్టాలన్న నిర్ణయం.

- ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టు చేపడతాం. రూ.24,269 కోట్లతో ఈ ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ఆమోదానికి పంపిస్తాం.

- రాష్ట్రంలో 16-17 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ప్రతి గ్రామ పంచాయితీ నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లాలకు డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు ఫోర్ లేన్ రోడ్డు ఉండేలా డెవలప్ మెంట్. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తాం.

- ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి గోషామహల్ లో స్థలం కేటాయింపునకు నిర్ణయం. పోలీసు శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసేలా ఆమోదం.

- ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాల కేటాయింపు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పో్ర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. గచ్చిబౌలి స్టేడియాన్నిఈ వర్సిటీకి వినియోగించేలా నిర్ణయం.

- స్కిల్ వర్సిటీకి అనుబంధంగా మధిర.. వికారాబాద్.. హుజూర్ నగర్ ఐటీఐలను కొత్తగా మంజూరు

- కొత్తకోర్టులకు.. రెండుకాలేజీలకు అవసరమైన సిబ్బంది మంజూరు

- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్తగా 142 పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గ ఆమోదం.

Tags:    

Similar News