ఈటల-బండి సంజయ్-అరవింద్-రఘునందన్...నేతల వెనుకంజ!

కోరుట్లలో ధర్మపురి అరవింద్ కు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది

Update: 2023-12-03 06:47 GMT

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలలో బిజెపికి ప్రజలు షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బిజెపికి చెందిన కీలక నేతలు ఈటల, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావులు ఫలితాలలో వెనుకబడడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గోషామహల్ లో రాజాసింగ్ మినహా మిగతా నేతలంతా వెనుకబడడంతో ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. మునుగోడులో ఐదో రౌండ్ ముగిసే సమయానికి బిజెపి అభ్యర్థి రఘునందన్ పై కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 7000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక, కరీంనగర్లో బండి సంజయ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డి 1300 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

కోరుట్లలో ధర్మపురి అరవింద్ కు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కార్వాన్, సిర్పూర్ కాగజ్ నగర్, నిర్మల్, ముధోల్, బోథ్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మహేశ్వరంలో బిజెపి అభ్యర్థులు స్వల్ప అధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత ఎన్నికలకు ముందు చెప్పడంతో బిజెపి, బీఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడిందని, ఆ భావన వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న అంచనాకు జనం వచ్చేశారని, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే బిజెపికి పడాల్సిన ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీని ఇచ్చారని, దాదాపు 65 స్థానాలకు పైగా ఆ పార్టీ గెలుచుకుంటుందని ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళని బట్టి అర్థమవుతుంది. బీఆర్ఎస్ కు 40 నుంచి 45 స్థానాలు వచ్చే అవకాశం ఉందని. బిజెపికి 5, ఎంఐఎం కి 4 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది.

Tags:    

Similar News