టార్గెట్ సౌతే అసలు వ్యూహమా ?

తెలంగాణాలో బలపడాలంటే అర్ధముంది. ఎందుకంటే ఇండియాకూటమిలో తెలంగాణాలో వామపక్షాలు మినహా మరే పార్టీలేదు.

Update: 2023-09-17 07:27 GMT

హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీకి బయట పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం జరగటం ఇదే మొదటిసారి. ఇదేదో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగారని నిర్వహించలేదు. చాలా వ్యూహాత్మకంగానే పార్టీ పెద్దలు సీడబ్ల్యూసీ సమావేశం ఇక్కడ నిర్వహించినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే శనివారం జరిగిన మొదటి రోజు సమావేశం మొత్తం జాతీయ రాజకీయాలపైనే జరిగింది.

మొదటిరోజు సమావేశం సారాంశం ఏమిటంటే దక్షణాదిలో కాంగ్రెస్ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చించారు. ముదు తెలంగాణా ఎన్నికల్లో గెలవడం ద్వారా సౌత్ రాజకీయాలను ప్రభావితం చేసేంత స్ధాయికి చేరుకోవాలని పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కర్నాటకలో అధికారంలోకి వచ్చారు.

అయితే తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉంది. కేరళలో సీపీఎం కూటమి అధికారంలో ఉంది. పాండిచ్చేరి, గోవాలో అధికారంలోదు. కాబట్టి తమిళనాడులో మిత్రపక్షాన్ని పక్కనపెట్టేసి ముందు పాండిచ్చేరి, గోవాతో పాటు కేరళలో అధికారంలోకి వచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది.

పనిలోపనిగా ఇండియా కూటమిలోని మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా గమనంలోకి తీసుకుని కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పథకాలు అమలుచేయాలని అనుకున్నారు. నిజంగా ఇదికాస్త క్లిష్టమైన వ్యవహారమే అనటంలో సందేహంలేదు. మిత్రపక్షాలున్నచోట కాంగ్రెస్ బలోపేతానికి చర్చలు తీసుకుంటే మిత్రపక్షాలు ఎందుకు ఊరుకుంటాయి.

మిత్రపక్షాలను నొప్పించకుండా పార్టీని బలోపేతం చేసుకోవటం సాధ్యంకాదు. మొత్తానికి కాంగ్రెస్ సమావేశం అనుకున్నంత తేలికకాద కాంగ్రెస్ బోలోపేతం. తెలంగాణాలో బలపడాలంటే అర్ధముంది. ఎందుకంటే ఇండియాకూటమిలో తెలంగాణాలో వామపక్షాలు మినహా మరే పార్టీలేదు.

వామపక్షాలు తెలంగాణాలో బలపడేది లేదు ఏమీలేదు. కాబట్టి కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా ఎవరికీ నష్టంలేదు. కొంతవరకు గోవాలో కూడా ఇలాంటి పరిస్ధితే ఉంది కాబట్టి ఇండియాకూటమి పార్టీలకు ఇబ్బందిలేదు. గోవాలో తృణమూల్ పోటీచేసినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

ఉత్తరాధిలో కాంగ్రెస్ బలోపేతానికి అవకాశాలు తక్కువని అగ్రనేతలకు అర్ధమైపోయింది. అందుకనే తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. ఇందులో ఏపీని మైనస్ చేసేయాల్సిందే. ఎందుకంటే విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ సమాధిస్ధితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి.

Tags:    

Similar News