ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ లో సడెన్ గా కొత్త పంచాయితీ మొదలైంది
కాంగ్రెస్ లో సడెన్ గా కొత్త పంచాయితీ మొదలైంది. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు ముంచు కొచ్చేస్తున్నాయి.
కాంగ్రెస్ లో సడెన్ గా కొత్త పంచాయితీ మొదలైంది. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు ముంచు కొచ్చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీసీలకు అధిష్టానం అన్యాయం చేస్తే సహించేదిలేదని బీసీ సంఘాల నేతలు పంచాయతీ మొదలుపెట్టారు. సర్వేల పేరుతో బీసీలకు టికెట్లు ఎగ్గొట్టేందుకు రెడ్డి నేతలు ప్లాన్ వేస్తున్నట్లు బీసీనేతలు మండిపడుతున్నారు.
2018 ఎన్నికల్లో కూడా సర్వేల పేరు చెప్పి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నట్లు అప్పట్లో కూడా పార్టీ అగ్రనేతలతో ప్రకటించిన విషయాన్ని ఇపుడు బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో గెలుపుగుర్రాలకు టికెట్లు ఇచ్చింది నిజమే అయితే రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ భార్య పద్మావతి లాంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పాలని గట్టిగా తగులుకున్నారు. ఇపుడు కూడా సేమ్ టు సేమ్ అలాంటి డ్రామానే రెడ్డి నేతలు మొదలుపెట్టారంటు మండిపోతున్నారు.
టికెట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయిన నేతల విషయంలో కొందరు రెడ్డి సినియర్లు సర్వేల ఫీడ్ బ్యాంక్ పేరుతో డ్రామాకు తెరలేపినట్లు బీసీ నేతలు అనుమానిస్తున్నారు. రెడ్డి నేతల డ్రామా విషయాన్ని ఢిల్లీలోని అగ్రనేతల దగ్గరే తేల్చుకునేందుకు బీసీ నేతలు రెడీ అయ్యారు. ఢిల్లీకి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు భేటీ అవబోతున్నారు. అలాగే సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంకతో కూడా భేటీ అయ్యేందుకు అపాయిట్మెంట్ అడిగారు.
సర్వేలు, ఫీడ్ బ్యాక్ పేరుతో తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకునేందుకు కొందరు రెడ్డి నేతల డ్రామాను ఢిల్లీలో వివరించేందుకు బీసీ నేతలు రెడీ అయ్యారు. మొత్తానికి హైదరాబాద్ లో పంచాయితి చివరకు ఢిల్లీకి చేరుకోబోతోంది. తొందరలోనే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని ఏఐసీసీ అనుకుంటుంటే సడెన్ గా ఈ బీసీ పంచాయితి మొదలవ్వటంతో అందరు షాక్ తిన్నట్లుగా అయిపోతున్నారు. మరీ పంచాయితి ఎక్కడికి దారితీస్తుందో తెలీకుండా ఉంది.