ఎన్నికల్లో చాలానే ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చాలా వ్యూహాలు ఉండాలి. గతంలో అయితే బే ఫికర్ గా ఉండేవారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఇపుడు అలా కాదు మెజారిటీ వచ్చినా కూడా వారిని కాపాడుకోవడం అతి పెద్ద తంతు గా మారుతోంది. నిజంగా ఇది ఎన్నికలను మించిన మరో యుద్ధంగా ఉంది అని అంటున్నారు.
అందుకే కాంగ్రెస్ అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రలలో జరిగిన ఉదంతాలు కాంగ్రెస్ వంటి పార్టీని ఫుల్ అలెర్ట్ చేస్తున్నాయి. అలాగే రెండు సార్లు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీయారెస్ తమ వైపునకు తిప్పుకుంది. ఇపుడు కూడా ఆపరేషన్ కాంగ్రెస్ చేపడుతున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ అన్ని చర్యలనూ తీసుకుంటోంది.
దాంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ సౌతిండియాలో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అపుడే హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ ని ఏ రకమైన ఆపరేషన్స్ కూడా ఏమీ చేయలేవని డీకే మీడియాకు చెబుతున్నారు. అయితే సకలమైన జాగ్రత్తలు కాంగ్రెస్ తీసుకుంటోంది.
కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పార్టీ పరిశీలకులను ఏర్పాటు చేస్తోంది. అలాగే వారు గెలిచిన వెంటనే అక్కడ నుంచి తీసుకుని వచ్చి వారందరినీ తమ వెంటనే ఉంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. హైదరాబాద్ లోని ఒక హొటల్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా ఉంటారని తెలుస్తోంది. వారితో డీకే కూడా ఉంటారని అంటున్నారు.
ఏకంగా యాభైకి పైగా గదులను ఎమ్మెల్యేల కోసం బుక్ చేసి ఉంచారు. అంటే హైదరాబాద్ లోనే క్యాంప్ ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది అని అంటున్నారు. ఇక వీరంతా కొన్ని రోజుల పాటు తాజ్ హొటల్ లోనే బస చేస్తారు వారిని కాంగ్రెస్ అలా కాపాడుకుంటుంది అని అంటున్నారు.
నెక్ టూ నెక్ అన్నట్లుగా పోటీ ఉంది కాబట్టి బీయారెస్ కి అధికారం కోసం అవసరం అయ్యే కొద్ది సీట్లు తగ్గినా కూడా కాంగ్రెస్ వైపు చూడవచ్చు అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఈ విధంగా కాంగ్రెస్ ఫుల్ అలెర్ట్ అయింది అని అంటున్నారు.
ఇక ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అంటున్నారు. అంతవరకూ తాజ్ హొటెల్ లోనే బస అంటే అయిదారు రోజుల పాటు క్యాంపులలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారని అంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు రాకుండా ఈ విధంగా చేస్తోంది అని అంటున్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేరాఫ్ తాజ్ హొటల్ అని అంటున్నారు.