హైకోర్టులో అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది ?!

మే 6 నుంచి తెలంగాణ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. ఈ మే 31తో సెలవులు పూర్తవుతాయి

Update: 2024-05-25 08:49 GMT

న్యాయస్థానాల చరిత్రలో తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదికయ్యింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మి నారాయణతో కూడిన డివిజన్ బెంచ్ ఒక్కరోజే లిస్ట్ లో ఉన్న 250 కేసులను విచారణ చేపట్టింది. గురువారం ఉదయం 10.30 నుంచి శుక్రవారం తెల్లవారుజామున 1గంట వరకు ఈ విచారణ సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మే 6 నుంచి తెలంగాణ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. ఈ మే 31తో సెలవులు పూర్తవుతాయి. అయితే అత్యవసర కేసుల విచారణకోసం వెకేషన్ బెంచ్ లు పనిచేస్తాయి. సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటీషన్ లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో కేసులన్నీ పూర్తయ్యే సరికి అర్థరాత్రి ఒంటిగంట దాటడం విశేషం.

బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో పలు సెక్షన్ల ప్రకారం ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించకుండా వాయిదా వేసింది. ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇక అమిత్ షా మార్ఫింగ్ కేసులో కింది కోర్టుకు విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు.. అర్ధరాత్రి ఒంటిగంటకు విచారించాల్సినంత ముఖ్యమైన విషయం కాదని వ్యాఖ్యానించింది. పిటిషన్ పై విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News