పవన్ కు సూటిప్రశ్న వేసిన అమర్నాథ్...అది అంత క్లిష్టమా?

తాజాగా విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-12-08 09:02 GMT

తాజాగా విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది కథ మూడు గంటల్లో చెప్పొచ్చు.. ఏపీ రాజధానికి దారేది అంటే ఎలా చెప్పేది అంటూ కామెంట్ చేశారు. దీంతో వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. మొదటి ఐదేళ్లలో తమరు ప్రభుత్వంలో ఉండి రాజధానిని అటూ ఇటూ కాకుండా చేసింది తమరేకథా అన్నట్లుగా ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో అమర్నాథ్ మైకుల ముందుకు వచ్చి పవన్ ను ఎద్దేవా చేశారు.

అవును... తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఇందులో భాగంగా... జనసేన బర్రెలక్కతో కూడా పోటీపడలేకపోయిందని.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. అనంతరం పవన్ కు ఒక కీలక ప్రశ్న సంధించారు అమర్నాథ్. ఇందులో భాగంగా అసలు పవన్ కల్యాణ్ కు ఏపీకి సంబంధం ఏమిటి అని అన్నారు. ఆయన ఇల్లు తెలంగాణలో ఉంటుంది కానీ.. ఇక్కడ పోటీ చేస్తానంటారు. అసలు పవన్ ది ఏపీలో ఏ నియోజకవర్గమో చెప్పండి? అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా... తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక పవన్‌ కు మతి భ్రమించినట్లు కనిపిస్తోందని.. సోషల్‌ మీడియాలో బర్రెలక్క స్థాయిలో పవన్‌ సేన పోటీ పడిందని అన్నారు. అలా అని తాను బర్రెలక్కను తక్కువ చేయడం లేదని తెలిపిన అమర్నాథ్... ఆమె స్థాయి కూడా పవన్‌ సేన పోటీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా శంకర్‌ గౌడ్‌ కు ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలని అన్నారు.

ఇదే క్రమంలో... తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు వచ్చిన ఎన్నికల ఫలితాలే ఏపీలో కూడా ఆ పార్టీకి వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇక విశాఖ రాజధాని విషయంలో పవన్ నుంచి వస్తున్న విమర్శలపై కూడా అమర్నాథ్ స్పందించారు. విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే వ్యక్తులు అసలు రాజధానిగా విశాఖ అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు.

ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ అది తన నియోజకవర్గంగా చెప్పుకుంటున్న పవన్ కు అసలు ఏపీలో ఏ నియోజకవర్గమో చెప్పాలని అమర్నాథ్ ప్రశ్నించారు. జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం ఉన్నాయి.. మరి పవన్ నియోజకవర్గం భీమవరమా, గాజువాకా అని అమర్నాథ్ ప్రశ్నించారు. తెలంగాణలో పొత్తుపెట్టుకుని బీజేపీని నాశనం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్ల విషయం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News