అధికారంలోకొచ్చినా తెలుగు తమ్మళ్లలో తీవ్ర అసంతృప్తి...!
దీంతో అందరూ ఖుషీగా ఉన్నారని చంద్రబాబు భావించడం కూడా తప్పుకాదు.
అధికారం దక్కింది.. హమ్మయ్య! అనుకున్నారు. ఇక, తమ్ముళ్లంతా హ్యాపీనేనని చంద్రబాబు కూడా భావిం చారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ వర్గం చాలా హ్యాపీగా ఉందని, ఉంటుందని కూడా భావించారు. ఇది సహజమే. అసలు అధికారంలోకి వస్తామా? అని రెండేళ్ల కిందట అనుకున్నతమ్ముళ్లకు కూటమి ఏర్పడ డం.. పవన్ సహకారం.. కేంద్రం నుంచి దన్ను రావడంతో గెలిచి నిలిచారు. అప్రతిహత విజయాన్ని అందుకున్నారు. ఇది ఎవరూ ఊహించని విజయం.
దీంతో అందరూ ఖుషీగా ఉన్నారని చంద్రబాబు భావించడం కూడా తప్పుకాదు. కానీ, క్షేత్రస్థాయిలో పరి స్థితి అలా లేదు. తమ్ముళ్లు ఇంకా రగులుతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ కోసం పనిచేసినవారు.. ఇప్పటికీ.. అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడింది కదా! ఇంకేంటి? అనుకుంటే.. ఇక్కడే అసలు సమస్య ఉంది. అదే.. `ప్రతీకార రాజకీయం` ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం. నేరుగా ప్రజాదర్బార్‌లోనే తమ్ముళ్లు ఈ ప్రతీకార రాజకీయాలపై ఫిర్యాదులు చేస్తున్నారు.
నారా లోకేష్ నుంచి ఇతర మంత్రుల వరకు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి సీఎం చంద్రబా బు వరకు అనేక మందికి అందుతున్న ఫిర్యాదుల్లో కేడర్ ఈ విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు అనేక రూపాల్లో వేధించారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటారా లేదా? అని నిలదీస్తున్నారు. చిత్రం ఏంటంటే.. ఎమ్మెల్యేలు కూడా కేడర్‌ను సర్దిచెప్పలేక పోతున్నారు. తర్వాత చూద్దాం లే! అని ఎవరైనా అంటే.. వెంటనే కేడర్ వారిపై మండిపడుతున్నారు.
మీరు మీరు ఒక్కటే మధ్య బలయ్యేది మా పిల్లలే అంటూ.. ఇప్పటికీ వైసీపీ పెట్టిన కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక, కేడర్ కూడా.. తమపై దాడులు చేసిన వారు తమ కళ్ల ముందే తిరుగుతున్నారని.. వారిని వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే... వాస్తవానికి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఉన్నా.. అది సాధ్యపడదని, ఇలా చేస్తే.. వైసీపీకి టీడీపీకి తేడా ఏం ఉంటుందని అధిష్టానం చెబుతోంది. కాబట్టి సంయమనం పాటించాలని సూచిస్తోంది. అయితే.. కేడర్ మాత్రం ఎక్కడా వినిపించుకోవడం లేదు. ఈ పరిణామాలతో కేడర్ అసంతృప్తి మాత్రం తగ్గడం లేదు.