తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి విజయం.. !
రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఫీల్ గుడ్ ఎట్మాస్ఫియర్ అనేది దశాబ్ద కాలంగా లేకుండా పోయిందనేది అంద రికీ తెలిసిందే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఫీల్ గుడ్ ఎట్మాస్ఫియర్ అనేది దశాబ్ద కాలంగా లేకుండా పోయిందనేది అంద రికీ తెలిసిందే. ఉమ్మడి ఏపీ నుంచి విభజన ద్వారా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కావడంతో... ఆయన దృష్టిలో రాజకీయ కారణాలు తెలంగాణను బందీ చేశాయి. ఫలితంగా.. ఏపీ అంటే.. దోచుకునేది, దాచుకునేది అనే భావన వ్యక్తీకరణ అయింది. ఫలితంగా.. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం ఏపీ అంటే.. పరాన్న జీవిగా ముద్ర పడింది.
ఒకానొక దశలో హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లు వెళ్లిపోవాలన్న వాదన కూడా తెరమీదికి వచ్చింది. అయి తే.. ఆదాయంఇస్తున్నది.. పన్నులు కడుతున్నది కూడా.. వారే కావడంతో మళ్లీ అదే కేసీఆర్.. కడుపులో పెట్టుకుంటాం! అంటూ కొత్త కబుర్లు చెప్పుకొచ్చారు. ఇలా.. ఏపీ విషయంలో తెలంగాణ పాలకుడిగా కేసీఆ ర్ నాటిన వ్యతిరేక విత్తనాలు అలానే ఉన్నాయి. తర్వాత.. కూడా కేసీఆర్ అధికారంలోకి రావడంతో ఆ భావన అలానే తెలంగాణ సమాజంలో ఉండిపోయింది.
ఇప్పటికీ కూడా.. పల్లెల్లో ఏపీ అంటే.. `మనల్ని దోచుకున్నరు కదురా! పుండాకోర్టు!!` అనే మాట వినిపిస్తూ నే ఉంటుంది. ఈ తరహా పరిస్థితి బిహార్ నుంచి విడివడిన జార్ఖండ్‌లో కానీ.. యూపీ నుంచివిడిపోయిన ఉత్తరాఖండ్‌లో కానీ.. మనకు కనిపించదు. కేవలం తెలంగాణ సమాజంలోనే నిభిడీకృతమైంది. ఇలాంటి వాతావరణాన్ని నేరుగా మార్చడం ఎవరివల్లా సాధ్యం కాదు. అయితే.. కార్యాచరణ ద్వారా.. కొంత మార్పు తీసుకువచ్చే ప్రయత్నం తాజా ముఖ్యమంత్రుల భేటీ ద్వారా జరిగింది.
ఈ విషయంలో ముఖ్యమంత్రుల తాజా భేటీ విజయం దక్కించుకుందనే చెప్పాలి. ఇరువురు ముఖ్యమం త్రులు కూడా సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేపట్టారు. పైగా ఎక్కడా వివాదాల జోలికి పోకుండా.. కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. ఇది ఆశావహ దృక్ఫథం. ముఖ్యంగా జల వివాదాలకు దారి తీయకుండా వ్యవహరించారు. అలానే ఉమ్మడి కమిటీలకు కూడా.. అంగీకారం కుదుర్చుకున్నారు. గతంలో కమిటీలు వేసేందుకు కూడా.. కేసీఆర్ ససేమిరా అన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. మొత్తంగా చూస్తే.. ఇరు రాష్ట్రాల మధ్య ఒక మంచి వాతావరణాన్ని పెంపొందించే విషయంలో ముఖ్యమంత్రులు తొలి విజయం దక్కించుకున్నారనే చెప్పాలి.