తెలుగు విద్యార్థుల మరణం వెనుక ఘోరమైన కారణం ఇదే!
అవును... యూనివర్సిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మృతులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం కు చెందిన నికేష్ (21)గా గుర్తించిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో వీరి మరణానికి గల కారణం వెల్లడైందని తెలుస్తుంది.
అవును... యూనివర్సిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు... భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన 16 రోజులకు అనుమాదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే వీరి మరణానికి కార్బన్ మోనాక్సైడ్ (సీవో) కారణం అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
శనివారం రాత్రి చాలా చలిగా ఉండటంతో... దినేష్, నికేశ్ ఒక రూంమెట్ తో కలిసి కలిసి రూం హీటర్ లను ఆన్ చేశారు. ఫలితంగా... చలి ఉష్ణోగ్రతలను నిరోధించడానికి ప్రయత్నించారు. అయితే... మరుసటి రోజు ఇద్దరూ తమ గదిలోంచి బయటకు రాకపోయేసరికి ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమై లోపలికి వెళ్లగా ఇద్దరు తెలుగు విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉన్నారు.
దీంతో వైద్య సహాయం కోసం హుటాహుటిన ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే వారిరువురూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో... కనెక్టికట్ విద్యారుల మరణాలకు కార్బన్ మోనాక్సైడ్ కారణం అని గుర్తించారని తెలుస్తుంది.
కార్బన్ మోనాక్సైడ్ అనేది రంగు, రుచి, వాసన లేని వాయువు. కాగా... అమెరికాలో ప్రతీ ఏటా సుమారు 6,000 మరణాలకు ఈ వాయువు కారణమవుతుంటుంది. వాహనాలు, పనిచేయని గది హీటర్లు, జనరేటర్లు ఈ కార్బన్ మోనాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే గదిలోని హీటర్ నుంచి ఈ వాయువు వెలువడి.. ఈ ఇద్దరు తెలుగు విద్యార్థుల ఉసురు తీసుకుందని అంటున్నారు.