ఆఫీసులో ఎక్కువ టైమ్ లంచ్ బ్రేక్ తీసుకుందని చంపేశాడు!

తాజాగా లంచ్ బ్రేక్ టైమ్ ఎక్కువగా తీసుకుందని సహోద్యోగిని కాల్చి చంపేశాడో వ్యక్తి!

Update: 2024-10-23 17:30 GMT

ఇటీవల కాలంలో అమెరికాలో ఏ సమస్యకైనా తుపాకీతో సమాధానం చెప్పడమే పరిష్కారం అన్నట్లుగా ఆలోచనలు మారిపోతున్నట్లున్నాయనే చర్చ నడుస్తోంది. కారణం ఏదైనా కాల్పులు కామన్ అయిపోయిన పరిస్థితి ఇప్పుడు అగ్రరాజ్యంలో నెలకొంది. తాజాగా లంచ్ బ్రేక్ టైమ్ ఎక్కువగా తీసుకుందని సహోద్యోగిని కాల్చి చంపేశాడో వ్యక్తి!

అవును... ఒక మహిళా సహోద్యోగిపై ఉత్తర టెక్సాస్ లో ఓ వ్యక్తి కాల్చి చంపాడు! ఎక్కువ సమయం లంచ్ బ్రేక్ తీసుకుందనేదే ఈ కాల్పులకు కారణం అని అంటున్నారు. ఆమె ప్రవర్తనపై ఆగ్రహం చెందిన అతడు.. ఆమె క్యూబికల్ వద్దే ఆమెపై కాల్పులు జరిపాడని అంటున్నారు. దీంతో.. ఆమె మృతి చెందింది!

అక్టోబర్ 17న ట్రావిస్ మోరిల్ (51) లూయిస్ విల్లేలోని అలెజియన్స్ ట్రక్కింగ్ లో పనిచేస్తోన్న తమ్హారా కొల్లాజో అనే మహిళపై కాల్పులు జరిపాడు. దీంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కొల్లాజో లంచ్ బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోరిల్ ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు!

ఈ సమయంలో ఆమెపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆమె మరణించింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ నేరాన్ని మోరిల్ అంగీకరించాడు. అనదికారిక లాంగ్ బ్రేక్స్ తీసుకోవడం వల్లే ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలిపాడు!

ఈ సందర్భంగా స్పందించిన అలీయన్స్ ట్రక్కింగ్ సంస్థ.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబానికి కంపెనీ, కొలీగ్స్ సహాయంగా ఉంటామని తెలిపింది. లూయిస్ విల్లే ఆఫీసును నిరవధికంగా మూసివేసినట్లు వెల్లడించింది. మరోపక్క మోరిల్ $1,00,00,000 బాండ్ పై డెంటన్ కౌంటీ జైలులో ఉంచబడ్డాడు!

Tags:    

Similar News