అల్ఫా ఫిమేల్ లక్షణాలేంటో తెలుసా?

ఇటీవల విడుదలైన యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన పాత్ర గురించి చర్చలు నడుస్తున్నాయి.

Update: 2023-12-28 02:45 GMT

మనుషుల్లో అల్ఫా మేల్, అల్ఫా ఫిమేల్ అని రెండు రకాలుగా ఉంటారు. అల్ఫా మేల్ మాదిరి అల్ఫా ఫిమేల్ లక్షణాలు కూడా సాధారణంగా ఒకేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన పాత్ర గురించి చర్చలు నడుస్తున్నాయి. అల్ఫా మేల్ పాత్రపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అల్ఫా మేల్ మాదిరి ఫిమేల్ కూడా ఉంటారనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి లక్షణాల గురించి ఓ సారి పరిశీలిద్దాం.

అల్ఫా ఫిమేల్ ప్రత్యేకంగా ఉంటారు. మన చుట్టు ఉండే సమాజంలో వారు కూడా అమ్మలు, అక్కలు, చెల్లెలు, భార్య లాంటి రూపాల్లో మనతోనే సహవాసం చేస్తుంటారు. సున్నితమైన మనస్తత్వంతో ఉంటారు. అల్ఫా స్త్రీలు జీవితంలో ఏం చేయాలనుకుంటారో అదే చేస్తుంటారు. బాధ్యతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. తమకు కావాల్సిన వాటిని కష్టపడి సంపాదించుకుంటారు. కఠినంగా కూడా కనిపిస్తారు.

అల్ఫా ఫిమేల్ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. జీవితాన్ని ఎదుర్కోవడంలో నమ్మకంతో ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఏమాత్రం ఇబ్బంది పడరు. జీవితాన్ని రిస్క్ గా తీసుకోరు. ఎంజాయ్ గా గడుపుతారు. సమయం వస్తే తప్ప వారిలోని ప్రతిభ బయట పెట్టేందుకు ఇష్టపడరు. వీరు ఏది కావాలంటే అదే కావాలని ఎదురు చూస్తారు. కోరుకున్న వస్తువును పొందే వరకు తమ ప్రయత్నాలు మానరు.

అల్ఫా ఫిమేల్ నిరుత్సాహంగా ఉండటానికి ఇష్టపడరు. ఎవరైనా కౌంటర్ వేస్తే ప్రతి కౌంటర్ వేడయం వారి నైజం. వారి ఆలోచనా విధానం కూడా అలాగే ఉంటుంది. కష్టాలు వచ్చినా తట్టుకుంటారు. సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుక్కుంటారు. సమస్యలను వదిలి వెళ్లడానికి ఇష్టపడరు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. ఇలాంటి నిర్ణయాలు అల్ఫా ఫిమేల్ ల లక్షణాల్లో కనిపిస్తాయి.

Tags:    

Similar News