ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన కింగ్‌... షాకింగ్ గా ఆస్తులు!

ప్రపంచంలో దిగ్గజ వ్యాపారవేత్తల గురించి, ప్రపంచంలోని టాప్ కుబేరుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అంతకు మించిన ఆస్తులు ఉన్నవాడు కావడం గమనార్హం.

Update: 2023-08-06 04:16 GMT

ప్రపంచంలో దిగ్గజ వ్యాపారవేత్తల గురించి, ప్రపంచంలోని టాప్ కుబేరుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అంతకు మించిన ఆస్తులు ఉన్నవాడు కావడం గమనార్హం. ఇతనికున్న కార్లు, పడవలు, పదుల సంఖ్యలో ఉన్న విమానాలు... ఆస్తుల వివరాలన్నీ తెలిస్తే ఆశ్చర్యపోవడం మినహా మరో ఆప్షన్ ఉండకపోవచ్చు!

అవును... ప్రపంచంలో దిగ్గజ వ్యాపారవేత్తలను కూడా మించిన బిలియనీర్ అతను. అతను ఏ వ్యాపారవేత్తో కాదు. అతనో రాజు. ఈ భూ ప్రపంచంపై అత్యంత సంపద కలిగిన కింగ్‌! ఆ వ్యక్తి పేరు మహా వజిరలాంగ్‌ కార్న్‌. ఈ సంపన్న రాజు థాయిలాండ్ దేశాన్ని దాదాపు 7 ఏళ్లుగా పరిపాలిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... వజిరలాంగ్‌ తండ్రి భూమిబోల్ అదుల్యదేజ్ 2016లో చనిపోగా ఆ తర్వాత ఇతడి పట్టాభిషేకం 2019లో జరిగింది. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం.. ఈ వజిరలాంగ్‌ కార్న్‌ రాజ కుటుంబ సంపద 40 బిలియన్ డాలర్లు అంటే రూ.3.2 లక్షల కోట్లు అని అంచనా!

వజిరలాంగ్‌ కార్న్‌ కు థాయిలాండ్‌ లో 16,210 ఎకరాలు భూమి ఉంది. బ్యాంకాక్‌ లో 17,000తో సహా దేశవ్యాప్తంగా 40,000 రెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఈ భూముల్లో ప్రభుత్వ భవనాలు, మాల్స్, హోటళ్లు పెట్టుకోగా వాటి నుంచి నెల నెలా అద్దె వస్తుంది.

ఇక ఈయన ప్యాలెస్ 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 1782లో నిర్మించిన ఈ ప్యాలెస్‌ ను ఆయన రాజ నివాసంగా ఉపయోగించకపోవడం గమనార్హం. ఈ ప్యాలెస్‌ లో ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు ఉన్నాయి.

ఈ రాజుకు బోయింగ్, ఎయిర్‌ బస్, సుఖోయ్ సూపర్‌ జెట్‌ తో సహా 38 విమానాల సముదాయం ఉంది. ఈ సేకరణలో 21 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటి యాన్యువల్ ఆపరేషన్ కాస్ట్ అక్షరాలా రూ.524 కోట్లు. ల్యూమిసినెస్, మెర్సిడెస్ బెంజ్ సహా 300 ఖరీదైన కార్లను కూడా ఈ రాజు కొనుగోలు చేశారు. వీటితోపాటు 52 బోట్స్ కొన్నారు.

ఇదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఖరీదైన వజ్రం 545.67 క్యారెట్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఇతనివద్దే ఉంది. దీని ధర రూ.98 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక థాయ్‌ లాండ్‌ లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్‌ లో ఇతనిపేరుమీద 23% వాటా ఉంది.

కాగా... యూరప్, ఆసియా దేశాలలోని లగ్జరీ ప్యాలెస్‌ లలో విలాసవంతమైన జీవితం గడిపే ఈ రాజు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తారు కానీ... పేదవారికి మాత్రం చిల్లిగవ్వ కూడా దానం చేయరనే విమర్శ ఉండటం గమనార్హం!

Tags:    

Similar News