పెళ్లికి ముందే శృంగారం.. అదే అక్కడ రూల్.. ఎక్కడంటే?

పెళ్లికి ముందు శృంగారానికి అక్కడి పెద్దలు పూర్తి అనుమతి ఉండటమే కాదు.. వారు కలిసి కొన్నేళ్లు బతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసే ప్రాంతం మన దేశంలోని ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలోని ఒక తెగలో ఈ తీరు కనిపిస్తుంది.

Update: 2023-10-27 15:30 GMT

నాగరిక సమాజం.. అత్యాధునిక సాంకేతం.. ఇలాంటి మాటలు చాలానే చెప్పినా.. కొన్ని విషయాలకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటాం. ఇప్పటికి లివింగ్ రిలేషన్ లో ఉన్నారని చెబితే చెంపలు పగిలిపోతాయి. తోపు పొజిషన్ లో ఉన్నప్పటికి.. ఇంట్లో వారికి తెలీకుండా.. ఊరికి దూరంగా ఉద్యోగం చేసే ప్రాంతంలో లివింగ్ లో ఉంటూ.. కొంతకాలానికి పెళ్లి చేసుకునే జంటల్ని కొన్నింటిని చూస్తుంటాం. అయితే.. ఇందుకు భిన్నంగా దేశంలోని ఒక తెగ వారు.. పెళ్లికి ముందు తప్పనిసరిగా యువతీయువకులు లివింగ్ లో ఉండి తీరాల్సిందే.

అలా ఉన్న వేళ.. ఇరువురికి నచ్చిన తర్వాతే పెళ్లి ఊసు వస్తుందట. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజం. పెళ్లికి ముందు శృంగారానికి అక్కడి పెద్దలు పూర్తి అనుమతి ఉండటమే కాదు.. వారు కలిసి కొన్నేళ్లు బతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసే ప్రాంతం మన దేశంలోని ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలోని ఒక తెగలో ఈ తీరు కనిపిస్తుంది. మరియా తెగకు చెందిన ప్రజలు.. యువతీయువకులు సహజీవనం చేసేలా ప్రోత్సహిస్తారు.

అక్కడి ప్రజలు వెదురు లేదంటే మట్టితో ఒక గుడిసెను నిర్మిస్తారు. గ్రామానికి చెందిన యువతీ యువకులు ఒక ప్రాంతానికి చేరి ఆటపాటలతో సరదాగా గడుపుతారు. అబ్బాయిలు తమకున్న తెలివి.. కళాత్మక తీరుతో రకరకాల దువ్వెనలు తయారు చేస్తారు. ఈ ఆటలో అబ్బాయిలు తయారు చేసిన దువ్వెనలో అమ్మాయికి నచ్చిన అబ్బాయి తయారు చేసిన దువ్వెనను దొంగలిస్తారు. ఆపై వారిద్దరు అదే గుడిసెలో కొన్నాళ్ల పాటు సహజీవనం చేస్తారు. ఇలా శారీరకంగా.. మానసికంగా దగ్గరూ.. ఒకరికొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ జంటకు పెద్దలు మంచి ముహుర్తం పెట్టి లగ్నం ఖాయం చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ తరహా విధానాన్ని మొదలు పెట్టిన తర్వాత తమ తెగలో దంపతులు విడిపోవటం.. విడాకులు తీసుకోవటం లాంటివి చాలావరకు తగ్గిపోయినట్లుగా చెప్పటం గమనార్హం.

Tags:    

Similar News