తొలి ట్రెండ్స్ లో టీడీపీకే ఆధిక్యం !?

ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా శరవేగంగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Update: 2024-05-25 03:00 GMT

ఏపీలో జూన్ 4న ఏమి జరగనుంది అన్నది ఒక ఎడ తెగని ఉత్కంఠ. అయితే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా శరవేగంగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి పోలింగ్ లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారు.

అదేంటి అంటే పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కించడం. సాధారణంగా కూదా అదే జరుగుతుంది. కానీ ఈసారి మరింత ఫోకస్డ్ గా దీని మీద ఈసీ దృష్టి పెట్టడానికి కారణం పోస్టల్ బ్యాలెట్ కూడా ఆషామాషీ రికార్డు క్రియేట్ చేయలేదు. ఏకంగా కొన్ని జిల్లాలలో అయితే నూరు శాతం కూడా ఓటింగ్ నమోదు అయింది.

దాంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబిల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగ అయిదు లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్ పోల్ అయింది ఈసారి అని అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పాటుగానే వాడిగా ఇది జరిగింది అని చెబుతున్నారు. దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ మీదట సాధారణ ఓట్లను లెక్క పెడతారు అని అంటున్నారు

పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ శాతం ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే టీడీపీ కూటమికి అని అనధికారికంగా ప్రచారం సాగుతోంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ వర్గాలు సర్కార్ మీద ఆగ్రహంగానే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు.

ఇక ఒక ప్రముఖ సర్వే సంస్థ విశ్లేషకుడి అంచనా ప్రకారం చూస్తే నూటికి డెబ్బై అయిదు శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అంటున్నారు. అంటే ఇది భారీగా వైసీపీకి నష్టం గా మారే అంశం. ఇక ఉదయాన్నే కౌంటింగ్ ప్రారంభం అయితే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మెజారిటీలు అన్నీ భారీ ఎత్తున టీడీపీ కూటమికే వస్తాయని అంటున్నారు.

దాదాపుగా నూటికి తొంబై శాతం నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్ లోనే టీడీపీ ఆధిక్యతను గట్టిగా చాటి చెబుతాయని అంటున్నారు. ఇక ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా ముప్పై వేల దాకా పోస్టల్ బ్యాలెట్ పడింది. అంటే జిల్లాలో ఎవరేజ్ లెక్కన పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే మూడు వేల ఓట్లు తక్కువ కాకుండా పోస్టల్ ఓట్లు జత కలుస్తాయన్న మాట. ఈసారి హోరా హోరీ పోరుగా సాగిన సంగతి విధితమే

అలాంటపుడు నూటికి డెబ్బై అయిదు శాతం ఓట్లు కూటమికి పడాయని ప్రచారం సాగుతోంది. చాలా చోట్ల వేయి అయిదు వందల ఓట్లతో కనుక గెలుపు ఓటములు సాగితే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ అక్కడ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా మొత్తానికి మొత్తం ఫలితాన్నే చేంజ్ చేసే సత్తా పోస్టల్ బ్యాలెట్ కి ఈసారి ఉంది అని అంటున్నారు.

దాంతో ఇపుడు ఎవరైనా భారీ మెజారిటీలు అంటే పది వేలకు పై చిలుకు ఓట్లు సాధిస్తేనే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావాన్ని తప్పించుకోలేరు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తొలి ట్రెండ్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా రావడం అంటే జనవరి 4 తొలి గంటలల్లోనే ఏపీలో విపక్షం సంతోషాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మధ్యాహ్నానికి ఫలితం తుది రూపు తెలియవచ్చు.

అపుడు ఈ తొలి ట్రెండ్స్ ఓట్లు ఎంత మేరకు గెలుపుని శాసిస్తాయో చూసిన మీదట ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో విజేత నిర్ణయం అవుతారు. అంతవరకూ మాత్రం కూటమి ఆనందాన్ని జోష్ ని ఎవరూ ఆపలేరు అని అంటున్నారు. ఇక అసలు ఫలితాల్లో కూడా కూటమి కనుక జోరు ప్రదర్శిస్తే ఏపీ రాజకీయం టోటల్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News