ట్రంప్ పై కాల్పుల ఘటన... క్రూక్స్ నర్మగర్భ పోస్ట్ వైరల్!
ఇందులో భాగంగా... నిందితుడు థామస్ మ్యాథ్యూ క్రూక్స్ ఈ ఘటన కంటే కొన్నాళ్ల ముందే హింట్ ఇచ్చాడని.. ఈ మేరకు ఓ నర్మగర్భ పోస్ట్ చేశాడని చెబుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కారణాలను వీలైనత లోతుగా విచారించి తెలుసుకునే పనిలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) ఉందని అంటున్నారు. ఈ సమయంలో వారికి కీలక ఆధారం దొరికిందని చెబుతున్నారు.
అవును... డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన కేసులో ఎఫ్.బీ.ఐ. చేతికి కీలక ఆధారం లభించింది. ఇందులో భాగంగా... నిందితుడు థామస్ మ్యాథ్యూ క్రూక్స్ ఈ ఘటన కంటే కొన్నాళ్ల ముందే హింట్ ఇచ్చాడని.. ఈ మేరకు ఓ నర్మగర్భ పోస్ట్ చేశాడని చెబుతున్నారు. తాజాగా సెనేటర్లకు ఎఫ్.బీ.ఐ. ఇచ్చిన వివరణలో ఈ విషయం వెల్లడైందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా... నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఈ ఘటనకు కొన్నేళ్ల ముందు గేమింగ్ ఫ్లాట్ ఫం "స్టీమ్" లో హింట్ ఇచ్చాడని అంటున్నారు. ఈ మేరకు... "నా తొలి అడుగు జూలై 13న.. అది ఆవిషృతం అవుతున్నప్పుడు వీక్షించండి" అని పేర్కొన్నాడు అని ఫ్యాక్స్ న్యూస్ వెల్లడించింది. దీంతో... ఇది ఎప్పటి నుంచో క్రూక్స్ మధిలో ఉన్న ఆలోచన అని.. ఇది పక్కా ప్లానింగ్ తో చేసిన పని అని అంటున్నారు.
వాస్తవానికి క్రూక్స్ హింట్ ఇచ్చిన గేమింగ్ ఫ్లాట్ ఫాం "స్టీమ్" వేదికగా గేమ్స్ అమ్మకాలు, డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో క్రూక్స్ వినియోగించే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను దర్యాప్తు బృందం పూర్తిగా విశ్లేషిసోందంట. ఈ క్రమంలోనే ఆతడు రెండు మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు చెబుతున్నారు.
అందులో ఒకటి ఘటనా స్థలంలో దొరకగా.. రెండోది క్రూక్ నివసంలో లభ్యమైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అతడి సెర్చ్ హిస్టరీలో... జూలై నెలలో బైడెన్, ట్రంప్ నకు సంబంధించిన సమాచారాన్ని అతడు వెతికినట్లు దొరికిందని అంటున్నారు. ఇందులో జూలై 13 ట్రంప్ ర్యాలీ వివరాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఇక ఇంట్లో దొరికిన అతడు వాడుతున్న రెండో ఫోన్ పైనా అధికారులు దృష్టి సారించారు. అందులో కేవలం 27 కాంటాక్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. అయితే... అవి ఎవరివి అనే దిశగా దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... దాడికి కొద్దిసేపటికి ముందే క్రూక్స్ కనిపించడం లేదంటూ అతడి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు.