డ్ర*గ్స్ విషయంలో దేశాలు ఎంత సీరియస్ గా ఉంటున్నాయంటే..ముగ్గురు ఇండియన్స్ కు మరణశిక్ష!

ఈ విషయంలో దాదాపు అన్ని దేశాల్లో అత్యంత కఠినమైన శిక్షలే ఉంటున్నాయి.;

Update: 2025-03-21 11:15 GMT
Death Penalty For Three Indians In Indonesia

అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న, అభివృద్ధి చెందని దేశాలు.. అంటే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకూ ఉన్న అతిపెద్ద సమస్యల్లో మాదకద్రవ్యాలు ఒకటి. ఈ డ్ర*గ్స్ సమస్య ఇప్పుడు దాదాపు అన్ని దేశాలకు పెను సవాలుగా మారింది. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం నుంచి అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దేశాలవరకూ ఇదే అతిపెద్ద సమస్యగా ఉంది.

ఈ విషయంలో దాదాపు అన్ని దేశాల్లో అత్యంత కఠినమైన శిక్షలే ఉంటున్నాయి. మరికొన్ని దేశాల్లో నేరుగా మరణశిక్షలు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓడలో డ్ర*గ్స్ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయ పౌరులకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి.

అవును... డ్ర*గ్స్ వాడుతున్నవారికి శిక్షలు ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో వారిని రీహెబిటేషన్ సెంటర్స్ కి పంపి, వారు సక్రమంగా జీవించడానికి ఒక అవకాశం ఇస్తున్నాయి పలు దేశాల చట్టాలు. అయితే... డ్ర*గ్స్ రవాణా విషయంలో మాత్రం క్షమించడం లేదు! నేరుగా క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తున్నాయి!

ఈ సమయంలో సింగపూర్ షిప్పింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన భారతీయులు సెల్వదురై దినకరన్, రాజు ముత్తుకుమరన్, గోవిందసామి విమల్కందన్ లను కార్గో నౌకలో సుమారు 106 కిలోల క్రిస్టల్ మెత్ ను అక్రమంగా తరలించిన కేసులో అరెస్ట్ చేశారు ఇండోనేషియా పోలీసులు. వీరి తరుపున భారతీయ న్యాయవాది జాన్ పాల్ వాదిస్తున్నారు.

ఈ కేసులో ముగ్గురు భారతీయ పౌరులైన నిందితులతో పాటు.. విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్ కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఏప్రిల్ 15న తుది తీర్పు వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో డ్ర*గ్స్ అక్రమ రవాణా విషయంలో ప్రపంచ దేశాలు ఎంత సీరియస్ గా ఉన్నాయనేది అర్ధమవుతుందని అంటున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News