ఆ ఒక్కటి వద్దు అంటున్న అమ్మాయిలు అసలు సంగతి ఇదే

మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.

Update: 2024-09-10 13:27 GMT

మన సమాజంలో పెళ్లి అంటే భయపడని ఆడపిల్లలు ఉండరు. పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే కాదు ఒక ఆడపిల్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక ఘట్టం. అయితే తమ జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు లేక చుట్టుపక్కల వారి జీవితాల వళ్ల నేర్చుకున్న పాఠాలో తెలియదు కానీ ప్రస్తుతం యువత పెళ్లి అని ఆలోచనకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.

కాలంతో పాటు పరిస్థితులు మనిషి ఆలోచన కూడా మారుతూ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు బ్యాచిలర్స్ గా ఉన్న అమ్మాయిల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. తాజాగా మోర్గానిక్ స్టార్టీ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెళ్లడయింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో సింగిల్ గా ఉండడానికి ఇష్టపడే ఆడవారి సంఖ్య 45 శాతానికి పెరుగుతుంది అని అంచనా. అంటే ప్రపంచవ్యాప్తంగా పుట్టే పిల్లల సంఖ్య పై కూడా దీని తీవ్ర ప్రభావం ఉండబోతుందన్నమాట.

ఈ ట్రెండ్ కేవలం ఒక దేశానికి పరిమితం కావడం లేదు.. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలకు అప్పటివరకు తాము అనుభవించిన స్వతంత్రం పై నియంత్రణ తగ్గుతోంది. పిల్లలు, ఇంటి బాధ్యతలతో కెరీర్ పై పూర్తిగా కాన్సెంట్రేట్ చేయలేకపోతున్నారు. ఇండిపెండెంట్ గా ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్న నేటి తరానికి పాతకాలం పరిమితులు సెట్ కావడం లేదు. అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో తెలియకుండా పిల్లల్ని పెంచడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

పెళ్లి చేసుకొని వారి సంగతి పక్కన పెడితే పెళ్లి చేసుకున్న వారు కూడా డైవర్స్ లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాస్త ఆలోచనలు భిన్నంగా ఉంటే చాలు.. మేమెందుకు అడ్జస్ట్ అవ్వాలి అంటూ విడిపోతున్నారు. దీంతో సమాజంలో ఒంటరిగా మిగిలిపోయి మహిళల సంఖ్య అధికమవుతోంది. పెళ్లి, పిల్లలు లాంటి జంజాటలు అవసరం లేకుండా దత్తత తీసుకుంటే సరిపోతుంది అనే వైఖరి కూడా ప్రస్తుతం యువతలో కనిపిస్తోంది. చూడడానికి ట్రెండీగా ఉన్న ఈ ఆలోచన సమాజంలో బలంగా పాతుకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

Tags:    

Similar News