పీ4 ఫార్ములా బాబుని ఇరుకున పెడుతుందా ?
ఇది ఇపుడు ఒక శ్రీరామ రక్షగా తారక మంత్రంగా చంద్రబాబు భావిస్తున్నారు ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉన్న వేళ చంద్రబాబు ఈ కాన్సెప్ట్ ని ముందు పెడుతున్నారు.
అసలు ఏమిటీ పీ4 అంటే అదే బాబు గారి విజన్ అని చెప్పాలి. పీపీపీ అంటే తెలుసు. పీ3లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ఉన్నాయి. మరి పీ4 ఫుల్ ఫాం ఏమిటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఇది చంద్రబాబు కనిపెట్టిన వినూత్నమైన ఆలోచన.
ఇది ఇపుడు ఒక శ్రీరామ రక్షగా తారక మంత్రంగా చంద్రబాబు భావిస్తున్నారు ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉన్న వేళ చంద్రబాబు ఈ కాన్సెప్ట్ ని ముందు పెడుతున్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రత్యేకించి పీ4 గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రోడ్లు వేయాలి అన్నా లేక అన్నా క్యాంటీన్లను మెయిన్ టెయిన్ చేయాలి అన్నా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలి అన్నా అవన్నీ పీ4 మోడల్ లోకి తీసుకుని రావాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
సర్వరోగ నివారిణి అన్నట్లుగా పీ4 ఉంటుంది అన్న మాట. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు కదా. అందుకే డబ్బు సాధించాలీ అంటే పీ4 మోడల్ ఒక్కటే పరిష్కారం అని బాబు భావిస్తున్నారు. ఈ పీ4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నది అయితే ప్రచారంలో ఉంది.
ఇది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని వారిని పార్టనర్ గా పెట్టి చేస్తారు అంటే ఎంతవరకూ అది సక్సెస్ అవుతుంది ఎవరు ముందుకు వస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు అంటే అది ప్రభుత్వానికి పార్టీలకు పెద్ద దెబ్బగా ఉంటుంది అని అంటున్నారు.
పీ4 మోడల్ ని అమలు చేస్తూ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేస్తారు అని అంటున్నారు. ఆ మీదట ఆ రోడ్లకు టోల్ ఫీజ్ వసూలు చేస్తారు అని అంటున్నారు. అంటే ఈ విధంగా టోల్ చార్జీలు పెట్టి వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
అయితే ఇది నిజమో కాదో తెలియదు కానీ బయట మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. జగన్ కూడా ఒక వైపు డబ్బులు ఇచ్చి మరో వైపు లిక్కర్ ద్వారా అదే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. అంతే కాదు చెత్త పన్ను విధించి ఆదాయం పెంచుకున్నారు అని పెట్రోల్ డీజిల్ ద్వారా పన్నులు వసూలు చేశారు అని విపక్షాలు విమర్శించాయి. ఇలా గత ప్రభుత్వం చాలా రకాలుగా ప్రజల నుంచి వసూలు చేస్తూ పోయింది.
అందుకే ఒక వైపు ఎంతలా సంక్షేమ పధకాలు అమలు చేసినా మరో వైపు జనాల నుంచి వసూలు చేయడం వల్లనే ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు ఇచ్చి అలా పరిమితం చేశారు అని అంటున్నారు. ఇపుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మేలు చేసినా ఆ మంచి కంటే ప్రజల నుంచి ఇతర రూపాలలో వసూలు చేస్తున్నారు అన్నదే ఎక్కువగా ప్రచారం అవుతుంది.
ఇక రోడ్ల విషయం చూస్తే ఇది టీడీపీ పొలిట్ బ్యూరోలో కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. పీ4 విధానంలో రోడ్లను అభివృద్ధి చేయడం వరకూ ఓకే కానీ ఆ తరువాత టోల్ చార్జీలు పెట్టి జనాల వద్ద వసూలు చేస్త చెడ్డ పేరు వస్తుందని పార్టీ నేతలు మాట్లాడినట్లుగా తెలిసింది.
అయితే ఖజానాలో డబ్బులు లేవు. ఏపీలో రోడ్లు బాగా లేవు. రోడ్లు వేయకపోతే జనాలు అదే పెద్ద సమస్యగా భావిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం మీద అదే రకమైన విమర్శలు వచ్చేవి. అందుకే కూటమి ప్రభుత్వం రోడ్లను వేయాలని నిర్నయించుకుంది. దానికి వేల కోట్లు ఖర్చు అవుతాయి. అందుకే పీ4 విధానం అని అంటున్నారు.
మరి ఈ విధానంలో రోడ్లను నిర్మించిన వారికి గిట్టుబాటు కావాలంటే టోల్ చార్జీలు వసూలు చేయాల్సిందే. మరి ఇది ద్విచక్ర వాహనాలను మినహాయించి కార్లు లారీలు ఇతర వాహనాలకు వసూలు చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. లారీలకు టోల్ చారీలు వేసినా అది ఇండైరెక్ట్ గా ప్రజల మీదనే భారంగా మారుతుంది.
ఎందుకంటే నిత్యావసరాలు ఇతర ఆహార పదార్ధాలు రవాణా చేసేది లారీల ద్వారానే. అలాగే బస్సులలో ప్రయాణం చేస్తే టోల్ చార్జీఎలు వేస్తే అది జనాలు కట్టే టికెట్ నుంచే అదనంగా చూపించి తీసుకుంటారు. అలా ప్రజలకు ఇది భారం పడకుండా అసలు ఉండదు. చివరికి ప్రజలకు రోడ్లు వేసారు అన్న మంచి పేరు కంటే డబ్బులు వసూలు చేశారు అన్న చెడ్డ పేరే వస్తుంది. మరి ప్రభుత్వం అయితే పీపీపీ అంటోంది. అలాగే పీ4 అని అంటోంది. మరి ఈ విధానం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.