తెలంగాణలో 10వేల ఎకరాల్ని కేసీఆర్ ఫ్యామిలీ కబ్జా?

ఉక్కిరిబిక్కిరి చేసే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు టీపీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి

Update: 2023-08-05 04:47 GMT

ఉక్కిరిబిక్కిరి చేసే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు టీపీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మరోసారి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేవారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తుందన్న ఆయన.. ''హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పది వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసింది. రూ.లక్షకోట్లు వెనకేసున్న తర్వాత కేసీఆర్ కు తెలంగాణ మీద మోజు తీరింది'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కుటుంబానికి భూదాహం పెరిగిందన్న రేవంత్.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అన్న రేవంత్.. 'ఆ బ్రహ్మ రాక్షసుడికి మందు పెట్టి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల్లో ఉండి ప్రజల కోసం మేం కొట్లాడుతున్నాం'' అని పేర్కొన్నారు. వరద సహాయక చర్యలపై అసెంబ్లీలో తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్ర బాబు ప్రశ్నిస్తుంటే.. మంత్రులు అడ్డుకుంటున్నారన్నారు.

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకొని ఉండి ఉంటే.. సీతక్క లాంటి ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టాల్సి వచ్చేది కాదన్న రేవంత్.. వరదబాధిత ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీల మాదిరి వీధుల్లోతిరుగుతున్నారన్నారు. 'రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా?'' అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణపై కేసీఆర్ కు మోజు తీరిన కారణంగానే.. తెలంగాణలోని వరద ప్రాంతాల్లో పర్యటించకుండా మహారాష్ట్రకు వెళ్లారన్నారు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణలోని రైతుల మీద ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News