బంగారు గనిలో ఘోర ప్రమాదం... షాకింగ్ గా మృతుల లెక్కలు!

పశ్చిమ మాలిలో అక్రమంగా నిర్వహించబడుతున్నట్లు చెబుతున్న బంగారు గని కూలిపోవడంతో కనీసం 48 మంది మరణించారని అధికారులు తెలిపారు.

Update: 2025-02-16 14:40 GMT

ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో చోటు చేసుకున్న ప్రమాదం కారణంగా సుమారు 100 మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన నెల రోజుల్లో తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఓ బంగారు గని కూలిపోవడంతో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు.

అవును... పశ్చిమ మాలిలో అక్రమంగా నిర్వహించబడుతున్నట్లు చెబుతున్న బంగారు గని కూలిపోవడంతో కనీసం 48 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ మేరకు స్థానిక వర్గాలు ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ కు తెలిపాయి! ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటైన దేశంలో ఈ విలువైన లోహానికి సంబంధించి క్రమబద్దీకరించని మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది.

అయితే.. వాటిని నియంత్రించడానికి అధికారులు చాలా కష్టపడుతున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ.. అవి యదేచ్ఛగా సాగుతుండగా.. ఈ వరుస ప్రమాదాలకు కారణమవుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. కొండచరియలు విరిగిపడిన తర్వాత మరణించిన వారి సంఖ్య 48 అని.. మృతుల్లు యువత ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

వాస్తవానికి ఆఫ్రికాలో మాలి అనేది ప్రముఖ బంగారు ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ఎక్కువ అని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఘోరమైన కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదాలకు వేదికగా నిలుస్తున్నాయి.

కాగా... దక్షిణాఫ్రికాలోని ఓ బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు ఈ ఏడాది జనవరిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆకలితో మరణించారని అన్నారు. ఇక, సుమారు ఏడాది క్రితం బంగారు గనుల్లో తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో సొరంగం కూలి 70 మందికి పైగా మరణించారు.

Tags:    

Similar News