మోదీ..పుతిన్..జిన్ పింగ్.. స్ట్రాంగ్ లీడర్.. 4వ పిల్లర్ ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికాగా అధ్యక్షుడిగా దిగిపోనున్న బైడెన్ సహా మిగతా దేశాల నాయకులు వీరితో పోలిస్తే వెనుకంజే.
అమెరికా ఎన్నికల క్రతువు ముగిసింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ట్రిపుల్ సెంచరీ కొట్టి (300 ఎలక్టోరల్ ఓట్లు) మరీ గెలుపొందారు. అయితే.. ఏంటట.. అంటారా? ఇప్పడు ప్రపంచంలో ఇదే అతిపెద్ద వార్త. ఓవైపు ఆసియా, యూరప్ లో రెండు యుద్ధాలు జరుగుతుండగా ట్రంప్ రాక మలుపే అని చెప్పాలి. అంతేకాదు ప్రపంచానికి ఆయనో నాలుగో పిల్లర్ కానున్నారు.
ఆ ముగ్గురితో పాటు
ఇప్పుడున్న ప్రపంచ దేశాధినేతల్లో బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు.. ప్రజల ఆదరణ ఘనంగా ఉన్నవారు.. తమ మాటను స్వదేశంలో చెల్లించుకోగలవారు.. తమ దేశ ప్రయోజనాలు దెబ్బతింటే ఇతర దేశాలపై కటువుగా వ్యవహరించగల సత్తా ఉన్నవారు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికాగా అధ్యక్షుడిగా దిగిపోనున్న బైడెన్ సహా మిగతా దేశాల నాయకులు వీరితో పోలిస్తే వెనుకంజే.
వచ్చాడు నాలుగో నాయకుడు..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుతో మోదీ, పుతిన్, జిన్ పింగ్ స్థాయిలో బలమైన నాయకుడు వచ్చినట్లయింది. ప్రపంచంలో జరుగుతున్న రెండు యుద్ధాలు (ఉక్రెయిన్-రష్యా), (ఇజ్రాయెల్-హమాస్) ట్రంప్ చొరవతో ఆగే స్థాయి ఉన్నవే. పుతిన్ తో మాట్లాడే స్థాయి మోదీతో పాటు ట్రంప్ నకూ ఉందనే సంగతి తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో ఉత్తర కొరియాతోనూ ట్రంప్ ఘర్షణ వైఖరి వీడి సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూ తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారంలోగా యుద్ధం ఆగాలని డెడ్ లైన్ విధించారు.
చైనాతో సంబంధాల మాటేమిటో?
మోదీ, పుతిన్ హయాంలోనే.. గతంలో అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ భారత్, రష్యాలతో సత్సంబంధాలు నెరిపారు ట్రంప్. కానీ, చైనాతో నే ఘర్షణ పడ్డారు. కొవిడ్ వైరస్ ను చైనా వైరస్ గా అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యలపై అప్పట్లో చైనా తీవ్రంగా మండిపడింది. మరిప్పుడు అమెరికా-చైనా సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి.
కొసమెరుపు: పుతిన్ 25 ఏళ్లుగా రష్యాపై తన పట్టును కొనసాగిస్తున్నారు. జిన్ పింగ్ 12 సంవత్సరాలుగా, మోదీ పదేళ్లకు పైబడి దేశాధినేతలుగా ఉన్నారు. ట్రంప్ రెండో (చివరి) శకం త్వరలో మొదలుకానుంది. దాదాపు నలుగురూ ఒకే సమయంలో నాలుగేళ్లు పదవిలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచ గమనంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.