ట్రంప్ పుస్తకానికి భారీ డిమాండ్.. గంటల్లోనే బెస్ట్ సెల్లర్ ట్యాగ్
సంచలనాలకు.. వివాదాలకు.. దూకుడుతనానికి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
సంచలనాలకు.. వివాదాలకు.. దూకుడుతనానికి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నిక కావాలన్న పట్టుదలతో ఉన్న ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఆయన.. తాజాగా రాసిన ఆయన పుస్తకం పెను సంచలనంగా మారింది. ఆయన కొత్త పుస్తకం ‘‘సేవ్ అమెరికా’’ సంచలనంగా మారింది.
ఈ పుస్తకం విడుదలైన గంటల వ్యవధిలోనే బెస్ట్ సెల్లర్ గా నిలవటం విశేషం. ఈ పుస్తకం ధర దగ్గర దగ్గర రూ.7500 వరకు ఉన్నప్పటికీ అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ గా నిలిచిన వైనం ఆసక్తికరంగా మారింది.అమెజాన్ లో ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్ జాబితాలో తొలిస్థానంలో నిలవగా.. మొత్తంగా 13వ స్థానంలో ఉంది. ఈ పుస్తకంలో ట్రంప్ పదవీ కాలం.. ప్రచార సమయంలోని విశేషాలను ఇందులో పొందుపరిచారు.
ఈ పుస్తకం కవర్ పేజీగా.. జులైలో ట్రంప్ మీద హత్యాయత్నం జరగటం..ఆయన పై జరిగిన కాల్పుల వేళ.. త్రుటిలో తప్పించుకోవటం.. తన చెవికి గాయమైనా పట్టించుకోకుండా.. రక్తమోడుతున్న గాయంతో పిడికిలి బిగించి.. ఫైట్ అంటూ నినదిస్తున్న వేళ తీసిన ఫోటోను వాడారు. ఈ ఫోటో నెట్ లోనూ తీవ్ర సంచలనంగా మారటం తెలిసిందే. ఈ పుస్తకంలో నాటి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్.. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తో ఉన్న ఫోటోలను ఈ బుక్ లో వాడారు.
అంతేకాదు.. ఈ పుస్తకంలో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పై విమర్శలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీని సమర్థించుకోవటం లాంటి అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అంతేకాదు..తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలన్న అంశాన్ని ఆయన ఆలోచిస్తున్నారో.. ఆ విషయాల్ని కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాల్ని ఇందులో పొందుపర్చారు. తనతాజా పుస్తకం గురించి ట్రంప్ కు చెందిన సోషల్ మీడియా ట్రూత్ లోనూ ప్రమోట్ చేసుకున్నారు. మొత్తంగా ఎన్నికల వేళ.. ట్రంప్ పుస్తకం హాట్ టాపిక్ గా మారింది.