చెవికి బుల్లెట్ గాయం... ట్రంప్ నోట ఆసక్తికరమైన మాట!

ఈ సమయంలో ఆ ఘటన జరిగిన సమయంలో తన అనుభవాలను, ఆలోచనలను పంచుకునారు ట్రంప్!

Update: 2024-07-16 05:17 GMT

గత రెండు మూడు రోజులుగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మస్థైర్యం గురించిన చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. చెవిని తాకుతూ తుపాకీ తూటా వెళ్లిన తర్వాత, రక్తమోడుతున్నా... "ఫైట్!.. ఫైట్!.." అటూ ఆయన చేసిన నినాదాలు ఇప్పటికీ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి! ఈ సమయంలో ఆ ఘటన జరిగిన సమయంలో తన అనుభవాలను, ఆలోచనలను పంచుకునారు ట్రంప్!


అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిన్నమొన్నటి వరకూ ట్రంప్, బైడెన్ ల డిబెట్ లు, విమార్శలు ప్రతివిమర్శలు హాట్ టాపిక్స్ గా ఉండగా... ట్రంప్ పై కాల్పుల ఘటన అనంతరం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. పైగా ఈ ఘటన అనంతరం ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడ్డాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆ ఘటన అనుభవాలను ట్రంప్ వివరించారు.

ట్రంప్ ని చాలా మంది మోడివాడు అని అంటుంటారు! అటు వ్యాపారంలో కానీ, రాజకీయాల్లోనే కానీ, వ్యక్తిగత జీవితంలోనే కానీ... ట్రంప్ అనుకున్నాడంటే సాధించే వరకు వదిలిపెట్టడని, ఆ సమయంలో చాలా మొండిగా ఉంటాడని కథనాలొస్తుంటాయి! అయితే... చెవికి తుపాకీ తూటా తగిలినా కూడా ట్రంప్ అదే మొండి వైఖరితో ఆలోచించారంట. ఆ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెళ్లడించారు.

ఇందులో భాగంగా... గన్ ఫైరింగ్ సౌండ్ రాగానే మరణించినట్లు అనుకున్నానని తెలిపిన ట్రంప్... దేవుని కృప వల్ల బతికి బయటపడట్లు తెలిపారు. ఆ సభలో మాట్లాడుతున్న సమయంలో తల పక్కకు తిప్పడం కలిసొచ్చిందని.. లేదంటే ఆ బుల్లెట్ బ్రెయిన్ లోకి వెళ్లేదని అన్నారు! ఇదంతా ఓ పీడకలల ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

అయితే... బుల్లెట్ తగిలిన తర్వాత కూడా తాను ప్రసంగం కొనసాగించాలని భావించినట్లు చెప్పడం గమనార్హం. అయితే సీక్రెట్ సర్వీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్పత్రికి వెళ్లాల్సిందే అని తనపై ఒత్తిడి తెచ్చారని ట్రంప్ తెలిపారు. దీంతో... ట్రంప్ ఆత్మస్థైర్యం గొప్పదని కొంతమంది అంటుంటే... ట్రంప్ బలం ఆ మొండి వైఖరే అని మరికొంతమంది అభిప్రాయపడుతునారు.

పెన్సిల్వేనియాలో జరిగిన సభలో కాల్పుల ఘటన అనంతరం ఆయన తజాగా రిపబ్లికన్ సదస్సులో పాల్గొనేందుకు విమానంలో మిల్వాకీకి ప్రయాణిస్తూ ఓ దినపత్రికతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరిగిన ఘటనపై వైద్యులు కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. సరిగ్గా తూటా తలకు తగిలే సమయంలో ఆ తల తిప్పడం వల్ల సేఫ్ అయ్యారని చెప్పారని తెలిపారు. ఇదొక అద్భుతమని అంతా అంటున్నారని.. ఇదంతా దేవుని కృప అని ట్రంప్ తెలిపారు.

Tags:    

Similar News