టీవీ సీరియల్ మార్చొద్దన్న భార్య.. తప్పదన్న భర్త.. చివరకు ఘోరం
తాజాగా గత రాత్రి తాను ఇంటికి వచ్చేసరికి టీవీలో సీరియల్ చూస్తున్న భార్య నిషాను.. ఆ సీరియల్ వద్దు.. క్రికెట్టో, వార్తలో పెట్టు అందరూ చూడొచ్చని.. ఆశీర్వాదం కోరాడు.
టీవీ సీరియళ్ల పిచ్చి ముదిరి పాకాన పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు అయిం దంటే చాలు.. మహిళలు టీవీలకు అతుక్కుపోతున్నారని, భారత దేశంలో సీరియళ్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదని..ఇ టీవల ఓ అధ్యయనం కూడా వెల్లడైంది. మొత్తంగా చూస్తే.. ఈ టీవీ సీరియళ్ల పిచ్చి. ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఏకంగా కుటుంబ పెద్ద ఆత్మహత్యకు కూడా దారి తీసింది.
విషయం ఇదీ..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు ప్రాంతంలో ఆశీర్వాదం(40), నిషా(36) దంపతులు నివసిస్తున్నారు. ఆశీర్వాదం స్థానికంగా కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. పని నుంచి ఇంటికి వచ్చాక ఆశీర్వాదానికి టీవీ చూసే అలవాటు ఉంది. ఇదేస మయంలో ఇంటి పనులు పూర్తి చేసుకుని టీవీ ముందు కూర్చునే అలవాటు ఆయన సతీమణి నిషాకు కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య తరచుగా రిమోట్ కోసం గొడవలు జరుగుతున్నాయి.
తాజాగా గత రాత్రి తాను ఇంటికి వచ్చేసరికి టీవీలో సీరియల్ చూస్తున్న భార్య నిషాను.. ఆ సీరియల్ వద్దు.. క్రికెట్టో, వార్తలో పెట్టు అందరూ చూడొచ్చని.. ఆశీర్వాదం కోరాడు. దీనికి నిషా ససేమిరా అంది. అంతేకాదు.. టీవీ రిమోట్ ఇచ్చేది లేదని భీష్మించింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుని.. వివాదానికి దారి తీసింది. దీంతో మనస్తాపం చెందిన ఆశీర్వాదం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఇక, టీవీ సీరియల్ చూడొద్దని ఒత్తిడి చేసి..తన తిట్టిపోసిన భర్తపై అలిగి నిషా కూడా... సమీపంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. అర్థరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్న ఆశీర్వాదం.. వచ్చీరావడంతోనే.. నేరుగా బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, తెల్లారి ఇంటికి చేరుకున్న నిషా.. తన భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి నిర్ఘాంత పోయింది. మొత్తానికి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. టీవీ రిమోట్.. ఇంత పనిచేయడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.