మిస్ యూనివర్స్ పోటీలకు ఇద్దరు ట్రాన్స్ జెండర్లు
ప్రపంచంలోని పలు దేశాలలో ట్రాన్స్ జెండ్లర్లపై వివక్ష ఉన్న సంగతి తెలిసిందే.
ప్రపంచంలోని పలు దేశాలలో ట్రాన్స్ జెండ్లర్లపై వివక్ష ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఎల్ జీబీటీక్యూ హక్కులపై అవగాహన పెరగడం, వారు కూడా పలు రంగాలలో రాణించడంతో ట్రాన్స్ జెండర్లపై గతంలో ఉన్నంత వివక్ష ఇపుడు లేదని చెప్పవచ్చు. ఇటీవల కొన్ని రంగాలలో ట్రాన్స్ జెండర్లు కీలక బాధ్యతలు కూడా చేపట్టి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలలో ట్రాన్స్ జెండర్లు పాల్గొనబోతున్న వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది నవంబరు 18న జరగబోయే విశ్వ సుందరి పోటీలలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు పాల్గొనబోతున్నారు.
1952 నుంచి జరుగుతోన్న ఈ అందాల పోటీల్లో తొలిసారిగా ట్రాన్స్ జెండర్లు పాల్గొనబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను తొలిసారి దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే...మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనబోతున్నారు. మిస్ నెదర్లాండ్స్ గా ఓ ట్రాన్స్‌జెండర్ టైటిల్‌ను దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 22 ఏళ్ల రిక్కీ పోటీల్లో మేటి మోడల్స్‌ను ఓడించి ప్రథమ స్థానంలో నిలవడంతో ఆమె ఎల్ సాల్వడార్‌లో జరగనున్న 72వ మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యారు.
ఇక, మిస్ పోర్చుగల్ గా మారినా మచెట్ ఎంపికయ్యారు. ఆమె కూడా మిస్ యూనివర్స్-2023 పోటీలలో పాల్గొనబోతున్నారు. తొలిసారిగా ఇద్దరు ట్రాన్స్ జెండర్లు విశ్వ సుందరి పోటీలలో పాల్గొనబోతున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, ఈ ఇద్దరిలో ఒక్కరైనా విశ్వ సుందరిగా ఎంపికై నవ చరిత్రకు నాంది పలుకుతారేమో వేచి చూడాలి.