ఉండి నుంచి రఘురామ రెడీ... నామినేషన్ దాఖలుకు ప్లాన్స్ ఇవే!

ఆయన కోరుకున్న నరసాపురం లోక్ సభ టిక్కెట్ దక్కకపోయినా.. అనుకున్నట్లుగానే ఉండి అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకోవడంలో రఘురామ కృష్ణంరాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Update: 2024-04-21 09:50 GMT

కోరుకున్నది దక్కకపోయినా.. అనుకున్నదైతే సాధించారు రఘురామ కృష్ణంరాజు! ఆయన కోరుకున్న నరసాపురం లోక్ సభ టిక్కెట్ దక్కకపోయినా.. అనుకున్నట్లుగానే ఉండి అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకోవడంలో రఘురామ కృష్ణంరాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రామరాజు, శివరామరాజుని కాదని.. చంద్రబాబు రఘురామ రాజుకు ఉండి టిక్కెట్ కన్ ఫాం చేశారు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా బీ-ఫారం అందచేశారు.

అవును... రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించుకున్నారు. ఈ విషయం గతకొన్ని రోజులుగా నానుతున్నా.. శ్రీనివాస వర్మకు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ బీ-ఫారం ఇవ్వడంతో.. ఉండిలో రఘురామ అభ్యర్థిత్వం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయిందనే మాటలు వినిపించాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన తరుపున ఆయన కుమారుడు నామినేషన్ వేశారు! ఈ సమయంలో రఘురామ కూడా రెడీ అయిపోతున్నారు.

ఇందులో భాగంగా... ఈ నెల 22 (సోమవారం)న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఉండి నుంచి ఎమ్మార్వో ఆఫీసు, ఆర్వో కార్యాలయం వరకూ భారీ ర్యాలీ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని రఘురామ పిలుపు నిచ్చారు.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రామరాజుకి కొత్త బాధ్యతలు!:

ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణంరాజుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో.. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో... ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్‌ బ్యూరోలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News